Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒత్తిడిలో చెలరేగాడు.. అతను టీమిండియాను శాసిస్తాడు: పాక్ దిగ్గజం

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. భవిష్యత్తులో టీమిండియా విలువైన ఆస్థిగా మారుతాడని ప్రశంసించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

సహచర ఓపెనర్ డేవాన్ కాన్వేతో కలిసి రుతురాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లను నిర్మించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో ఆడిన రుతురాజ్ నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 590 పరుగులు సాధించాడు. 2021 సీజన్‌లో రుతురాజ్‌ 635 పరుగులు చేశాడు. అప్పుడు కూడా సీఎస్‌కే చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే రుతురాజ్ ఆట తీరును విశ్లేషించిన వసీం అక్రమ్ అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్ అవుతాడని కితాబిచ్చాడు.

 Ruturaj Gaikwad

'ఐపీఎల్ 2023 సీజన్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటాడు. ఈసారి ఐపీఎల్‌లో అద్భుతమైన క్యాచ్‌లు, ఫీల్డింగ్‌ను మనం చూశాం. అందుకే, గైక్వాడ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. భారత జట్టుతోపాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ కీలక ప్లేయర్‌గా మారతాడు.'అని వసీం అక్రమ్‌ తెలిపాడు.

ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్.. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 92 పరుగులతో సత్తా చాటాడు. ఫైనల్లోనూ భారీ లక్ష్యచేధనలో 16 బంతుల్లోనే 26 పరుగులు చేసి శుభారంభం అందించాడు.

గతేడాది భారత జట్టులోకి అడుగు పెట్టిన రుతురాజ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇప్పటి వరకు 10 టీ20లు ఆడిన రుతురాజ్‌ 161 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 57 పరుగులు మాత్రమే. ఇక ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌ ఆడిన గైక్వాడ్ 42 బంతులను ఎదుర్కొని 19 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

తాజా ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైనప్పటికీ జూన్ 3వ తేదీన వివాహం ఉండటంతో తప్పుకున్నాడు. రుతురాజ్ తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్కర్ష పవార్ కూడా క్రికెటరే. పూణేకు చెందిన ఉత్కర్ష పవార్, మహారాష్ట్ర తరుపున దేశవాళీ క్రికెట్ ఆడుతోంది. కుడి చేతి బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.

Story first published: Thursday, June 1, 2023, 22:37 [IST]
Other articles published on Jun 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+