For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ ముందు బాబర్ ఆజామ్ బచ్చాగాడు.. ఇద్దరి మధ్య పోలికేంటి?: వసీం అక్రమ్

Wasim Akram says It is still too early to compare Babar Azam with Virat Kohli

కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ బచ్చాగాడని ఆ జట్టు దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. అసలు ఈ ఇద్దరి మధ్య పోలికే అనవసరమని అభిప్రాయపడ్డాడు. విరాట్‌తో పోల్చే స్థాయికి ఇంకా బాబర్ ఆజామ్ చేరుకోలేదని చెప్పాడు. ఇక గత కొన్నాళ్లుగా బాబర్ ఆజామ్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగిస్తున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో ఈ ఇద్దరినీ పోలుస్తూ పాకిస్థాన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజమ్‌ టాప్ క్లాస్ బ్యాటర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

 పోలికలు సహజమే..

పోలికలు సహజమే..

ఇదే అంశంపై ఓ చానెల్‌తో మాట్లాడిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్.. బాబర్ ఆజామ్ అభిమానుల గాలి తీసేశాడు.'క్రికెట్‌లో ఓ క్రికెటర్‌ను, మరో క్రికెటర్‌తో పోల్చి చూడడం అత్యంత సహజం. ఇంతకుముందు ఇంజమామ్ ఉల్ హక్‌ను రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లతో పోల్చి చూసేవాళ్లు క్రికెట్ ఫ్యాన్స్. అంతకుముందు సునీల్ గవాస్కర్, జావెల్ మియందాద్, గుండప్ప విశ్వనాథ్, జహీర్ అబ్బాస్ మధ్య కూడా ఇలాంటి పోలికలు వచ్చాయి.

బాబర్ చిన్న పిల్లాడే..

బాబర్ చిన్న పిల్లాడే..

ఇలా పోల్చి చూడడం సర్వ సాధారణం. బాబర్ ఆజామ్ కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. అతనిప్పుడు కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తన టెక్నిక్‌లో కూడా ఎలాంటి లోపాలు లేవు. అందుకే బాబర్ ఆజమ్ నిలకడగా రాణిస్తూ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడే అతన్ని విరాట్ కోహ్లీతో పోల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఉన్న అంతర్జాయతీయ అనుభవం ముందు బాబర్ ఆజమ్ ఇంకా చిన్నపిల్లాడే.

ఆసియా కప్ చాలా కీలకం..

ఆసియా కప్ చాలా కీలకం..

విరాట్ కోహ్లీతో పోల్చి చూడడానికి కావాల్సిన అర్హత సాధించాలంటే బాబర్ ఆజామ్‌కు ఇంకా చాలా సమయం పడుతుంది. విరాట్ కోహ్లీ ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించాడు. కుర్రాడికి కెప్టెన్సీ ఇస్తే... తాను నేర్చుకుంటూ, జట్టుని నడిపిస్తాడు. విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, ప్రతీ టీమ్‌కు ఆసియా కప్ 2022 టోర్నీ చాలా కీలకం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు జరుగుతున్న టోర్నీలో విజయం సాధిస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రపంచకప్‌లో బరిలో దిగొచ్చు.'అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.

కోహ్లీకి 14 ఏళ్ల కెరీర్..

కోహ్లీకి 14 ఏళ్ల కెరీర్..

వసీం అక్రమ్ చెప్పినట్టే విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి 14 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకుంటే... బాబర్ ఆజమ్ ఏడేళ్ల క్రితం 2015లోనే పాక్ టీమ్‌లోకి వచ్చాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు చేసిన బాబర్ ఆజమ్, 208 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.

Story first published: Wednesday, August 24, 2022, 15:52 [IST]
Other articles published on Aug 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+