నేను డ్రగ్స్‌కు బానిసయ్యాను.. ఆమె సహాయంతోనే మానేసాను: వసీం అక్రమ్

కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం తాను డ్రగ్స్‌కు బానిసైనట్లు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. గ్రాముల కొద్ది కొకైన్ తీసుకునేవాడిని, దాని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపాడు. చివరకు తన మాజీ సతీమణి సాయంతో డ్రగ్స్ నుంచి బయటపడ్డానని వెల్లడించాడు. స్వింగ్ సుల్తాన్ గా గుర్తింపుపొందిన వసీం అక్రమ్.. 90వ దశకంలో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టించాడు. తాజాగా అక్రమ్ తన ఆటోబయోగ్రఫీ 'సుల్తాన్ : ఎ మెమోయిర్'అనే పుస్తకం విడుదల సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

కొకైన్ లేకుండా ఉండేవాడిని కాదు..
ఈ సందర్బంగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడుతూ.. 'సౌత్ ఆసియాలో సంస్కృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ రాత్రి పదింటికి కూడా ఒకేసారి పది పార్టీలకు వెళ్లొచ్చు. నాకు డ్రగ్స్ ఇంగ్లండ్ లో అలవాటు అయ్యాయి. నా రిటైర్మెంట్ తర్వాత (2003లో) ఒక పార్టీలోకి వెళ్లినప్పుడు అక్కడ డ్రగ్స్ అలవాటు చేసుకున్నాను. క్రమంగా అది నన్ను అస్థిరపరిచింది. అది నన్ను మోసగించింది. నేను కూడా కొకైన్ తీసుకునేవాడిని. నా మొదటి భార్య హ్యూమాకు తెలియకుండా నేను ఒంటరిగా కరాచీకి వెళ్లి డ్రగ్స్ తీసుకునేవాడిని. ఒక్క గ్రామ్ నుంచి రెండు, మూడు దాకా వెళ్లేది. ఏం తినకపోయేవాడిని. నిద్ర ఉండేది కాదు. క్రమంగా అది నా డయాబెటిస్‌కు దారి తీసింది. మిగతావారి మాదిరిగానే నేనూ డ్రగ్స్‌కు బానిస అయ్యాను.

డ్రగ్స్ ప్యాకెట్ ఆమెకు దొరకడంతో..
కొకైన్ తీసుకోకుండా ఉండేవాడిని కాదు. కానీ ఒకసారి నా ప్యాంట్ జేబులో డ్రగ్స్ ప్యాకెట్ ఆమెకు కనబడింది. అప్పుడు ఆమె నాతో 'నీకు సాయం కావాలి'అని చెప్పింది. నేను కూడా అవునన్నాను. 2009లో ఆమె తన చివరిదశలో నాకు చాలా సాయం చేసింది. డ్రగ్స్‌ను నా నుంచి దూరం చేయడానికి ఆమె చేయగలిగినంత చేసింది. హ్యూమా చనిపోవడంతో నేను డ్రగ్స్‌ను వదిలేశాను. అప్పట్నుంచి మళ్లీ వాటి జోలికి పోలేదు.'అని తెలిపాడు.

ప్రపంచకప్ గెలిచిన..
అయితే అక్రమ్ చేసిన ఈ కామెంట్స్ పై పాకిస్తాన్ లో సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇటువంటి విషయాలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలని, అక్రమ్ తన జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు అందరినీ కలిచివేశాయని కామెంట్స్ చేస్తున్నారు. 1984 నుంచి 2003 వరకు పాకిస్థాన్ తరఫున ఆడిన అక్రమ్.. 104 టెస్టులలో 414 వికెట్లు తీశాడు. 356 వన్డేలలో 502 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ 1992 లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో అక్రమ్ కీలక సభ్యుడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications