Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మార్కో జాన్సెన్‌కు 6 వికెట్లు: వాషింగ్టన్ సుందర్

గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఇది మంచి పిచ్ అని, ఓపికగా ఆడితే పరుగులు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రణాళికలకు తగ్గట్లు ఆడకపోవడంతోనే తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. దూకుడుగా ఆడటం తమ వ్యూహమని, దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయామని అంగీకరించాడు.

సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. రోడ్డులాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. ఇదే పిచ్‌పై సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే.. భారత్ మాత్రం 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(58), వాషింగ్టన్ సుందర్(48) మినహా మరే బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లు విఫలమైన వికెట్‌పై సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ 6 వికెట్లు తీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Washington Sundar Reveals the Secret Behind Marco Jansen s Six-Wicket Spell on the Guwahati Batting Track in the IND vs SA 2nd Test

మూడో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన వాషింగ్టన్ సుందర్.. పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు. మార్కో జాన్సెన్ ఎత్తుగా ఉండటంతో పాటు సరైన లెంగ్త్‌లో వేయడంతో అతనికి వికెట్లు దక్కాయని తెలిపాడు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ ఏ మాత్రం లేదని స్పష్టం చేశాడు.

'ఇదేమి బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ఇది నిజమైన వికెట్. ఇలాంటి పిచ్‌లు భారత్‌లో అరుదుగా ఉంటాయి. క్రీజులో నిలబడితే పరుగులు వస్తాయి. దురదృష్టవశాత్తు మా బ్యాటింగ్ ప్రణాళికలకు తగ్గట్లు సాగలేదు. ఇలాంటి పిచ్‌లపై బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాదు. ఈ వికెట్ ఏ మాత్రం అన్‌ఈవెన్(అసమానం)గా లేదు. మార్కో జాన్సన్ సహజంగానే పొడుగ్గా ఉంటాడు. దాంతో అతను గుడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి మంచి బౌన్స్ రాబట్టాడు. మేం అతనిలాంటి బౌలర్లను చాలా సార్లు ఎదుర్కొన్నాం. ఈ రోజు మాకు కలిసి రాలేదు. మరో రోజు ఆ బంతులను బాగా ఆడి పరుగులు రాబట్టేవాళ్లం. అప్పుడు అది చాలా భిన్నంగా కనిపించేది.

జట్టు అవసరం మేరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్దం. ఈ విషయాన్ని నన్ను మరింత ఉత్సాహపరుస్తోంది. ఇది టీమ్ గేమ్. బ్యాటింగ్ ఆర్డర్ మార్పు వల్ల నాకు ఎలాంటి కలవరపాటు లేదు. నేను జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాలని కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఎలాంటి పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉంటాను. నా ఆలోచన తీరే ఇలా ఉంటుంది కాబట్టి నాకు ఎలాంటి ఆందోళన లేదు.

నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా ఉత్సాహంగానే ఉంటుంది. జట్టులో వివిధ పాత్రలు పోషించే అవకాశం దక్కుతుందనే సంతోషం కలుగుతోంది. చాలా మందికి ఇలాంటి అవకాశాలు రావు. కాబట్టి ఇది నాకు ఎంకరేజింగ్‌గానే ఉంటుంది.'అని వాషింగ్టన్ సుందర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 25, 2025, 12:05 [IST]
Other articles published on Nov 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+