IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
ఈ గెలుపుతో రెండు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు ఘోర పరాజయం ఎదురవ్వడం గమనార్హం.

టీమిండియాను ముంచిన ప్రసిధ్, సుందర్..
అయితే ఈ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలతోనే టీమిండియాకు ఈ ఘోర పరాజయం ఎదురైందని ఆరోపిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్.
ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. ఐర్లాండ్‌ను అద్భుతంగా కట్టడి చేసింది. కానీ 16, 17 ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ 46 రన్స్ సమర్పించుకోవడంతో ఐర్లాండ్ 118 నుంచి 164కి చేరింది. ఈ రెండు ఓవర్లు కాస్త కట్టడిగా వేసి ఉంటే ఐర్లాండ్ స్కోర్ 140కే పరిమితమయ్యేది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. మిడిల్ ఓవర్లలో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయామని, ఆ తప్పిదమే తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు.
చెత్త ఫీల్డింగ్, పేలవ బ్యాటింగ్..
అలాగే శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ కీలక క్యాచ్‌లు వదిలేయడం కూడా టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కూడా పెద్ద కష్టమేం కాదు. కానీ భారత టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో భారత్ 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ తప్పిదాలే భారత్ చిత్తుగా ఓడేలా చేశాయి. ఈ పరాజయంతో టీమిండియా చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు 9 టీ20లు, 3 వన్డేలు ఆడిన ఐర్లాండ్ 11 ప్రయత్నాల తర్వాత భారత్‌ను ఓడించింది. దాంతో ఆ జట్టుకు ఇది చారిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

