Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తాకరాని చోట తాకిన బంతి.. నొప్పితో విలవిలలాడిన సుందర్!(వీడియో)

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై పరుగులు చేయలేకపోతున్నారు. పిచ్‌‌పై అనూహ్య బౌన్స్‌తో పాటు టర్న్ ఉండటంతో బంతిని అంచనా వేయలేకపోతున్నారు. దాంతో బ్యాటర్లకు బంతులు పదే పదే తాకుతున్నాయి.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చాలా దెబ్బలు తగిలించుకున్నాడు. రిషభ్ పంత్ పొత్తి కడుపులో, భుజానికి బలమైన గాయాలయ్యాయి. హెల్మెట్‌కు పలుమార్లు తాకాయి. నొప్పితో విలవిలలాడిన రిషభ్ పంత్ ఫిజియోల సాయంతో బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు సహనం కోల్పోయి నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు.

Washington Sundar drops to his knees in agonizing pain after being hit on the box

టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు బంతి తాకరాని చోట తాకింది. ప్యాట్ కమిన్స్ వేసిన 66వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని కమిన్స్ గుడ్ లెంగ్త్‌లో వేయగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి వాషింగ్టన్ సుందర్ జననాంగ ప్రదేశంలో బలంగా తాకింది.

దాంతో కుప్పకూలిన వాషింగ్టన్ సుందర్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోలు వచ్చి సుందర్‌కు చికిత్స చేశారు. అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించిన సుందర్.. నొప్పితో సహనం కోల్పోయాడు. బౌండరీ బాది మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4), శుభ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లీ(17)మరోసారి దారుణంగా విఫలమయ్యారు. రిషభ్ పంత్(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), జడేజాతో కలిసి 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని స్కాట్ బోలాండ్ విడదీసాడు. వరుస బంతుల్లో రిషభ్ పంత్‌తో పాటు క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి(0)ని పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో శతకంతో రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. క్రీజులో కెప్టెన్ జస్‌ప్రిత్ బుమ్రా(4 బ్యాటింగ్)తో పాటు ప్రసిధ్ కృష్ణ ఉన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్(4/19) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్‌కు చెరో వికెట్ దక్కింది.

Story first published: Friday, January 3, 2025, 12:03 [IST]
Other articles published on Jan 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+