For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరి వల్లే ఈ ఏడు వికెట్ల ప్రదర్శన: వాషింగ్టన్ సుందర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలకు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కృతజ్ఞతలు తెలిపాడు. వారు అవకాశం ఇవ్వడంతోనే తాను ఏడు వికెట్ల ప్రదర్శన చేయగలిగానని చెప్పాడు. ఈ ఏడు వికెట్ల ప్రదర్శన పూర్తి క్రెడిట్ వారిదేనని స్పష్టం చేశాడు. ఇదంతా ఆ దేవుడి ప్రణాళికని చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్(7/59) సంచలన ప్రదర్శనతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. దాదాపు 45 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్.. అసాధారణ ప్రదర్శనతో నయా చరిత్రను లిఖించాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Washington Sundar credits Rohit Sharma and Gautam Gambhir to his seven-wicket haul in 2nd Test vs NZ

గంభీర్ మాటను నిలబెట్టుకొని..
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ పరాజయం అనంతరం గౌతమ్ గంభీర్ పట్టుబట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నాడు. ఈ ఎంపికపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జట్టులో ఇప్పటికే ఎక్స్‌ట్రా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉండగా.. సుందర్ ఎందుకు? అని ప్రశ్నించారు. కానీ సుందర్ తన సత్తా ఏంటో తెలియజేశాడు. గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

సుందర్‌తో పాటు అశ్విన్(3/64) మూడు వికెట్లతో సత్తా చాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు.

రోహిత్ డకౌట్..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ .. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(0) డకౌటవ్వగా.. యశస్వి జైస్వాల్(6 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(10 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఓ వికెట్ తీసాడు. భారత్‌ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.

గేమ్ ఛేంజింగ్ వికెట్స్..
తొలి రోజు ఆట అనంతరం వాషింగ్టన్ సుందర్.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో మాట్లాడాడు. తాను తీసిన ఏడు వికెట్లలో రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ఫేవరట్ అని చెప్పాడు. ఈ రెండు వికెట్లు ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాయని చెప్పుకొచ్చాడు. 'బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ నేను ఆడలేదు. ఈ మ్యాచ్ కోసమే నన్ను ప్రత్యేకంగా జట్టులోకి తీసుకున్నారు.

తుది జట్టులో అవకాశం కల్పించారు. కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మకు నా కృతజ్ఞతలు. ఈ ఏడు వికెట్ల ప్రదర్శన మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. పరిస్థితులుతో సంబంధం లేకుండా.. , బ్యాటర్ ఎవరా? అని ఆలోచించకుండా కచ్చితత్వంతో బౌలింగ్ చేయాలనుకున్నాను.

దేవుడి ప్రణాళిక..
ఇది దేవుడి ప్రణాళిక. నేను కేవలం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేయడంపై ఫోకస్ పెట్టాను. నా వేగాన్ని కాస్త తగ్గించాను. ఈ ప్రదర్శన చాలా గొప్పగా అనిపిస్తోంది. తొలి రోజు నుంచే పిచ్‌పై స్పిన్ లభిస్తుందని మాకు తెలుసు. తొలి సెషన్‌లో కూడా బంతి తిరిగింది. రెండో సెషన్‌లోనూ టర్న్ అయ్యింది.
మూడో సెషన్ వచ్చే వరకు స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలంగా మారింది. ఈ ఏడు వికెట్లలో ఒకటి ఫేవరేట్‌గా చెప్పడం సరికాదు. కానీ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ వికెట్స్ గేమ్ ఛేంజర్ అనవచ్చు.'అని వాషింగ్టన్ సుందర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 24, 2024, 18:04 [IST]
Other articles published on Oct 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+