For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: క్యాచ్ తెచ్చిన తంట.. సుందర్, బెయిర్ స్టో మధ్య గొడవ! (వీడియో)

Washington Sundar and Jonny Bairstow engage in heated exchange during first T20I
Ind vs Eng 1st T20I : Washington Sundar Involved In Heated Exchange With Jonny Bairstow || Oneindia

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోపై టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20‌లో భారత్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా సుంధర్, బెయిర్ స్టోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు అంపైర్, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ జోక్యం చేసుకోవడం సద్దుమణిగింది.

అసలు విషయం ఏంటంటే..?

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ ఆఖరి బంతిని క్రీజులో ఉన్న డేవిడ్‌ మలన్‌ స్ట్రైయిట్ షాట్ ఆడగా.. బంతి నాన్ స్ట్రైకర్ వైపు దూసుకెళ్లింది. అయితే బెయిర్‌ స్టో అప్పటికే క్రీజు నుంచి బయటకు రావడంతో సుందర్‌కు క్యాచ్ పట్టే అవకాశం లేకుండా పోయింది. బంతిని అందుకునే క్రమంలో సుందర్‌ బెయిర్‌ స్టోపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతి బెయిర్‌ స్టో హెల్మెట్‌కు తాకి పక్కకు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుందర్‌ బెయిర్‌ స్టో‌పై గట్టిగా అరిచాడు.

బెయిర్ స్టో కూడా..

బెయిర్ స్టో కూడా..

క్యాచ్‌ పట్టకుండా జానీ బెయిర్‌స్టో అడ్డుపడ్డాడని ఆరోపించిన వాషింగ్టన్ సుందర్.. మైదానంలోనే అతనితో గొడవకి దిగాడు. దాంతో.. బెయిర్‌స్టో కూడా వాదించడం మొదలెట్టాడు. ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశాడు. ఓవర్ ముగియడంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా.. సుందర్‌ని వెనక్కి తగ్గాలని సూచించడంతో వాగ్వాదం ముగిసింది. సిల్లీ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ఆ వాగ్వాదాన్ని సైలెంట్‌గా చూస్తుండిపోయాడు

సారీ చెప్పిన సుందర్..

సారీ చెప్పిన సుందర్..

అనంతరం వాస్తవం తెలుసుకున్న సుందర్.. తన మరుసటి ఓవర్‌ టైమ్‌లో బెయిర్ స్టోకు క్షమాపణలు చెప్పాడు. దాంతో అతను సుందర్ భుజంపై చేయి వేస్తూ పర్లేదంటూ.. ఆటలో ఇదంతా కామన్ అంటూ వెన్ను తట్టాడు. అయితే ఈఇద్దరి మధ్య జరిగిన హాట్ హాట్ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జాసన్‌ రాయ్‌ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది.

Story first published: Saturday, March 13, 2021, 15:43 [IST]
Other articles published on Mar 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+