
భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 321/6
మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఇలా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోవడం తనని ఆశ్చర్యపరిచిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
కోహ్లీ 2018 ట్రాక్ రికార్డు ఇదే.. అన్నింటిలోనూ విరాటే బెస్ట్

వెస్టిండీస్ కూడా 50 ఓవర్లలో 321/7తో
లక్ష్య ఛేదనలో షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సులు) సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. విశాఖపట్నంలో రాత్రి 7 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసినా.. సెకండాఫ్‌లో బౌలింగ్ చేసేందుకు కోహ్లి సిద్ధపడటంపై విమర్శలు కోకొల్లలుగా వచ్చాయి.

రాత్రి మంచు కురుస్తుందని తెలిసినా.. కోహ్లి
‘విశాఖలో రాత్రి మంచు కురుస్తుంది అని తెలిసినా.. విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపడం నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే.. తుది జట్టులో కుల్దీప్, చాహల్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో అతను ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోగలిగాడు. అంతకంటే ముఖ్యంగా.. ప్రపంచకప్ ముంగిట ఒత్తిడిలో ఆడటంపై టీమిండియా బౌలర్లని అతను పరీక్షించదలిచాడు. అందుకే సెకండాఫ్‌లో బౌలింగ్ చేయించేందుకు సిద్ధపడ్డాడు'

బౌలర్లు ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని అలవాటు
'ఐదు వన్డేల ఈ సిరీస్‌లో గెలవాలంటే భారత బౌలర్లు ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి'అని వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. మ్యాచ్ అనంతరం బౌలింగ్ సమయంలో మంచు కారణంగా బంతిపై గ్రిప్ దొరకలేదని కుల్దీప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్, వెస్టిండీస్ మధ్య పుణె వేదికగా శనివారం మూడో వన్డే జరగనుంది.


Click it and Unblock the Notifications
