
మూడు నిమిషాలు దాటడంతో
'కేప్‌టౌన్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఓపెనర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ త్వరగా ఔటయ్యారు. వసీం జాఫర్ పెవిలియన్ చేరిన అనంతరం సచిన్ టెండూల్కర్ క్రీజులోకి రాలేదు. అప్పటికే అతడు ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఇక మూడు నిమిషాలు దాటడంతో దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్ స్మిత్ క్రికెట్ రూల్స్ ప్రకారం టైమ్ ఔట్ డిస్మిసల్ ప్రకటించాలని మరో అంపైర్‌ను కోరాడు' అని డారిల్ హార్పర్ చెప్పారు.

అప్పీల్ చేయొద్దని సర్ది చెప్పా
'గ్రేమ్ స్మిత్‌ను అలా అప్పీల్ చేయొద్దని సర్ది చెప్పా. ఏదో కారణం చేత ఆలస్యమైండొచ్చని వివరించా. అంతకుముందు రోజు సచిన్ గాయపడడంతో ఆట మధ్యలోనే మైదానం వీడినట్లు వారికి గుర్తుచేశా. అప్పుడే ఫోర్త్ అంపైర్ కూడా సచిన్ మైదానంలోకి వెళ్లలేడని గుర్తుచేయడంతో తర్వాతి బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యారు. చివరగా గంగూలీ తర్వాత ఐదో స్థానంలో సచిన్ ఆడాడు' అని అంపైర్ డారిల్ హార్పర్ తెలిపారు.

ప్రెస్‌మీట్‌కు 50 మంది వచ్చారు
'ఆ రోజు ఆట పూర్తయ్యాక నేను ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా. ఓ పది మంది జర్నలిస్టులు ఉంటారనుకుంటే ఏకంగా 50 మంది వచ్చారు. వాళ్లంతా సచిన్ ఆలస్యానికి గల కారణం తెలుసుకోడానికే వచ్చారని నాకు ఆశ్చర్యం కలిగింది. టీమ్‌ఇండియా ఎక్కడ పర్యటించినా వారికి విశేషమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుచేతనే మీడియా కవరేజ్ కూడా భారీగా ఉంటుందని నాకునేను సర్ది చెప్పుకున్నా. ఆ పై అసలు విషయం చెప్పా' అని హార్పర్ పేర్కొన్నారు. ఒకసారి న్యూయార్క్‌లో ఇంటికి వెళుతుంటే ముగ్గురు భారతీయులు తనని ఆపి క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. వారెవరో తనకు తెలియకపోయినా తనని గుర్తుపట్టి అలా మాట్లాడటం బాగుందన్నాడు. వాళ్లెంతో మర్యాదగా ప్రవర్తించారని డారిల్ వెల్లడించాడు.
'పంత్, రాహుల్ వైపే సెలక్టర్లు.. ఐపీఎల్‌లో ధోనీ విఫలమైతే పునరాగమనం కష్టమే'


Click it and Unblock the Notifications
