'ఆ మ్యాచ్‌లో ధోనీ అనూహ్యంగా నిర్ణయాలు మార్చేశాడు'

న్యూఢిల్లీ: భారత్, ఆసీస్, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్-2012లో తుది జట్టు ఎంపిక విషయంలో నాటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా అతడి సెలక్షన్ విధానాన్ని తప్పుపట్టాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాడు. అనంతరం మీడియాతో ముచ్చటించాడు.

తుది జట్టులో ఆడించడం కుదరదని
2012లో ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్ సందర్భంగా మా ముగ్గురినీ (గంభీర్, సచిన్, సెహ్వాగ్) తుది జట్టులో ఆడించడం కుదరదని, ఇద్దరికే అవకాశముంటుందని తెలిపాడు. 2015 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అది నాకు పెద్ద షాక్. అలాంటి పరిస్థితి ఏ క్రికెటర్‌కైనా షాకే. ఒక ఆటగాడికి మూడేళ్ల తర్వాత జరిగే 2015 ప్రపంచకప్‌లో ఉండవని 2012లోనే ఎవరైనా చెబుతారా?
'వాళ్లు కూడా ఆడేలా కృషి చేస్తున్నాం'

భారత్ ఆ మ్యాచ్ గెలిచింది
ఒక ఆటగాడు పరుగులు చేస్తుంటే, మైదానంలో చురుగ్గా ఉంటే కోరుకున్నంత కాలం ఆడొచ్చు. మేం ముగ్గురం తుది జట్టులో ఉండమని ఆస్ట్రేలియాలో మాకు తెలిసింది. కానీ ఆ తర్వాత అదే సిరీస్‌లో మేం ముగ్గురం కలిసి ఆడాం. గెలుపు అత్యవసరమైన మ్యాచ్‌లో సెహ్వాగ్, సచిన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. మూడో స్థానంలో ఆడా. ఆ మ్యాచ్ భారత్ గెలిచింది.

ధోని మా ముగ్గురిని తుది జట్టులో
సిరీస్ ఆరంభంలో మేం ముగ్గురం కలిసి ఆడలేదు. రొటేషన్‌లో ఆడాం. కానీ విజయం తప్పనిసరైన స్థితిలో ధోని మా ముగ్గురిని తుది జట్టులో ఆడించాడు. కానీ, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అంటే తన నిర్ణయాన్ని అతడు మార్చుకున్నట్టే కదా. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలి.

ఆ నిర్ణయంతో మా ముగ్గురికీ దిగ్భ్రాంతి
ఈ సిరీస్‌లో హోబర్ట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. మా ముగ్గురిలో ఇద్దరినే తుది జట్టులో ఆడిస్తానని నువ్వే చెప్పావు. కానీ ముగ్గురినీ ఆడించాలని నువ్వే నిర్ణయించావు. అంటే రెండు నిర్ణయాల్లో ఏదో ఒకటి తప్పన్నమాట. కెప్టెన్ నిర్ణయం మా ముగ్గురినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications