ఈ తరం క్రికెటర్లకు ఈజీ మనీపైనే ఇంట్రస్ట్: పాక్ మాజీ క్రికెటర్

కరాచీ: ఈ తరం క్రికెటర్లు దేశం తరఫున ఆడటం కంటే సులువుగా డబ్బులు సంపాదించడంపైనే ఆసక్తి కనబరుస్తున్నారని పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ధనాధన్ ఫార్మాట్ రాకతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ టోర్నీల స్వరూపమే మారిపోయిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ కావడం.. పైగా కాసుల వర్షం కురవడంతో అన్ని క్రికెట్ దేశాలు టీ20 లీగ్స్ నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే దాయాదీ పాకిస్థాన్ కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను ప్రారంభించింది. కానీ.. ఐపీఎల్ తరహాలో ఆ టోర్నీ విజయవంతం కాకపోయినా ప్రేక్షకాదరణను అందుకుంది.
ఈ ఏడాది జరిగిన సీజన్ చివరి దశ వరకు అత్యంత విజయవంతంగా పాకిస్థాన్ వేదికగానే జరిగింది. ఓవర్సీస్ ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో పాల్గొన్నారు. అయితే టోర్నీ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల ముంగిట.. కరోనా దెబ్బతో అర్ధాంతరంగా వాయిదాపడింది. అయితే ఈ టీ20 లీగ్‌ల ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ఆయా దేశాల ఆటగాళ్లు సంప్రదాయక ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నారు.

డబ్బుల కోసమే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు..
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ 27 ఏళ్ల వయసులోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. వాహబ్ రియాజ్ కూడా ఇక రెడ్ బంతి క్రికెట్ ఆడానని స్పష్టం చేశాడు. అయితే వీరి నిర్ణయంపై పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ అయిన వకార్ యూనిస్ అసహనం వ్యక్తం చేశాడు. ఓ జర్నలిస్ట్‌తో కాన్షరెన్స్ కాల్ మాట్లాడిన ఈ మాజీ పేసర్.. టీ20 లీగ్‌ల ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆటగాళ్లు సంప్రదాయక ఆటకు గుడ్ బై చెబుతున్నారని తెలిపాడు.
‘టీ20 లీగ్స్ క్రికెటర్లకు సులువుగా డబ్బులను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు ఆటగాళ్లు కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటున్నారు. ముఖ్యంగా బౌలర్లు అయితే కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయాల్సి ఉండటంతో చాలా సౌకర్యంగా ఫీలవుతున్నారు. కానీ వారి వల్ల జాతీయ జట్టుకు జరగుతున్న నష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు. విశాల దృక్పథంతో ఆలోచించడం లేదు.'అని వకార్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వీడ్కోలా?
ఇక రిటైర్మెంట్ విషయం కూడా చెప్పా పెట్టకుండా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీరు సింపుల్‌గా సోషల్ మీడియా ద్వారా మీ నిర్ణయాన్ని ప్రకటించడం బాధిస్తోంది. క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే ముందు కనీసం బోర్డు పెద్దలకు కూడా తమ నిర్ణయాన్ని చెప్పడం లేదు. మీ నిర్ణయాన్ని ముందు బోర్డు పెద్దలకు తెలపండి. వారితో చర్చించండి. లేకుంటే టీమ్‌మేనేజ్‌మెంట్ తీవ్రంగా బాధపడాల్సి ఉంటుంది'అని అమీర్, రియాజ్‌లను ఉద్దేశించి వకార్ చెప్పుకొచ్చాడు.

మాకెలాంటి పగలేదు..
అమీర్, రియాజ్ దూరమైనంత మాత్రనా తమ జట్టు కోల్పోయింది ఏమీ లేదని, వారిపై కూడా తమకు ఎలాంటి పగలేదని వకార్ స్పష్టం చేశాడు. ‘వారి నిర్ణయం వల్ల మాకు నష్టం జరిగిందని నేను చెప్పను. కానీ వారు ముందు సమాచారం ఇచ్చి నిర్ణయాన్ని వెల్లడిస్తే బాగుండేది. అయినా వారిపై మాకు ఎలాంటి పగలేదు. ఇంకా వారికి క్రికెట్ లైఫ్ మిగిలే ఉంది. ఒకవేళ వారు పాకిస్థాన్ జట్టుకు ఎంపికైతే మాత్రం టెస్ట్ క్రికెట్ ఆడాలి. చాలా క్లిష్ట స్థితిలో జట్టును విడిచిపెట్టారు.'అని వకార్ చెప్పుకొచ్చాడు.

ఓ విధానం ఉండాలి..
పాకిస్థాన్ హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బా-ఉల్-హక్ గురించి కూడా పలు విషయాలు చెప్పుకొచ్చిన వకార్.. ఆటగాళ్ల వీడ్కోలు వ్యవహారం బోర్డుకు తెలిసేలా ఓ విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డాడు.‘టెస్ట్ క్రికెట్ నుంచి ఆటగాళ్ళ రిటైర్మెంట్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తెలిసెలా ఓ విధానం ఉండాలనేది నా అభిప్రాయం. కానీ ప్రస్తుత చట్టం ప్రకారం ఆటగాళ్లపై ఎటువంటి పరిమితులు విధించలేం. జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యే విషయం కావున ఆటగాళ్ళు బోర్డుతో సమన్వయం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి, 'అని వకార్ సూచించాడు.
పాకిస్థాన్ క్రికెటర్లే కాదు.. వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని టీ20 లీగ్స్‌లో ఆడుతున్న వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు.. ఆ దేశం తరఫున ఆడేందుకు మాత్రమ ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో వాళ్లు గొడవకి దిగేందుకు కూడా వెనుకాడటం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications