
థ్రిల్లింగ్‌గా ఉంది..
'ఇంట్లో టీవీలో వారి ఆటను చూసేవాడిని. ఇప్పుడు ఆ టీమ్‌లో భాగమయ్యే అవకాశం వచ్చింది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఆర్‌సీబీ తరఫున ఆడేందుకు ఉత్సాహంగా, గౌరవంగా భావిస్తున్నా'అని ఆర్‌సీబీ జెర్సీతో ఉన్న ఫోటోను షేర్ చేసి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌పై ఆర్‌సీబీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ కామెంట్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం హసరంగాకు అభినందనులు తెలుపుతున్నారు.

హసరంగా ఎవరంటే?
ఇక ఇటీవల భారత్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో హసరంగా భారత్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో (4/9) 4 వికెట్లతో గబ్బర్ సేనను ఉక్కిరి బిక్కిరి చేశాడు. తన బర్త్ డే రోజే సూపర్ పెర్ఫామెన్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. తొలి టీ20 రెండు, రెండో టీ20లో ఓ వికెట్‌తో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఇక వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ వన్డేలో విఫలమైనప్పటికీ.. రెండో వన్డేలో(3/37) మూడు, మూడో వన్డేలో (2/28) రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్ అనంతరమే హసరంగాకు ఐపీఎల్‌లో అవకాశం దక్కడం ఖాయమని అంతా భావించారు. అంతా ఊహించినట్లే హసరంగాతో ఆర్‌సీబీ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఈ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ ఆర్‌సీబీ జట్టులో కీలకం కానున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో అతనికి జట్టులో చోటు దక్కడం ఖాయం.

భారీ మార్పులు..
ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌ల నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీమ్ కోచ్ మారడంతో పాటు హసరంగాతో సహా కొత్తగా ముగ్గురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా, ఆస్ట్రేలియా ప్లేయర్ టీమ్ డేవిడ్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఈ మార్పుల విషయాన్ని ఆర్‌సీబీ టీమ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఓవర్‌సీస్ ఆటగాళ్ల గైర్హాజరీల నేపథ్యంలోనే ఈ మార్పులు చేశామని స్పష్టం చేసింది. ఆర్‌సీబీ హెడ్ కోచ్ సిమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ కోచ్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీ..
యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లకు కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండమని చెప్పారు. భారత్ వేదికగా లీగ్ జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు. తాజాగా ఈ జాబితాలో డానియల్ సామ్స్ కూడా చేరాడు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు ఫిన్ అలెన్, స్కాట్ కుగ్లిలెజిన్ కూడా స్వదేశీ టీమ్ పర్యటనల నేపథ్యంలో దూరం కానున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ముగ్గురు ప్లేయర్లను తీసుకున్నట్లు ఆర్‌సీబీ పేర్కొంది.


Click it and Unblock the Notifications












