Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాహ్ పప్పూ వాహ్.. వాటే బ్యాటింగ్! (వీడియో)

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. టెన్నిస్ బాల్ క్రికెటర్ పప్పూ తోడ్కర్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో పప్పూ తోడ్కర్ వినూత్నమైన షాట్లతో బౌండరీలు బాదాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌కు మించి ర్యాంప్ షాట్స్ ఆడాడు.

క్రీజులో డ్యాన్స్ చేస్తూ ఫైన్ లెగ్‌ వైపు భారీ సిక్సర్ బాదిన పప్పూ తోడ్కర్.. ఆఖరి నిమిషంలో స్టాన్స్ మార్చుకొని థర్డ్ మ్యాన్ వైపు సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత క్రీజులో కూర్చొని కీపర్ తలమీదుగా బౌండరీ బాదాడు. స్విచ్ హిట్‌తో థర్డ్ మ్యాన్ వైపు మరో బౌండరీ కొట్టిన పప్పూ.. లెగ్ సైడ్, మిడ్ వికెట్, లాంగాఫ్, లాంగాన్ దిశగా భారీ సిక్స్‌లు కొట్టాడు.

Aakash Chopra Shares Pappu Todkar s Batting Video

ఈ నైపుణ్యంతోనే అతను టెన్నిస్ బాల్ ఫ్రాంచైజీ లీగ్ 10PLలో చోటు దక్కించుకున్నాడు. ఆ టోర్నీలోనూ ఇదే తరహా వైవిధ్యమైన షాట్లతో అలరించాడు. పప్పూ తోడ్కర్ షాట్లకు ఫిదా అయిన ఆకాశ్ చోప్రా వాటిని అభిమానులతో పంచుకున్నాడు. 'వాహ్ పప్పూ వాహ్.. ఏం ఆడినవ్'శభాష్ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. స్కిల్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.పప్పూ బ్యాటింగ్ అద్భుతమని కామెంట్ చేస్తున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్‌పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత తుది జట్టును ఆచితూచి ఎంపిక చేయాలనే లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపాడు. టీమిండియా ఇద్దరూ స్పిన్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్.. ఇద్దరూ స్పెషలిస్ట్‌ పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుందన్నాడు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ ఆడుతారని అభిప్రాయపడ్డాడు. షమీ స్థానంలో హర్షిత్ రాణాను కూడా ఆడించే అవకాశం ఉందని తెలిపాడు.

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడుతాడని, కానీ గంభీర్ వరుణ్ చక్రవర్తీని ఆడించాలనుకుంటే అతను బెంచ్‌కే పరిమితమవుతాడని చెప్పాడు. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు లేవని, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. దుబాయ్ పిచ్‌లో భారత బ్యాటర్లు ఓపికగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు.

Story first published: Wednesday, February 19, 2025, 7:02 [IST]
Other articles published on Feb 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+