For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేటితరానికి ఆ ముంబై ఇండియన్స్ ఆటగాడు ఓ రోల్‌మోడల్: వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman says Suryakumar Yadav is a great role model for youngsters
#SuryakumarYadav Is A Perfect Role Model For Youngsters - VVS Laxman || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం యువకులకు సూర్య ఓ రోల్​ మోడల్​ అని కొనియాడాడు. భారత జట్టు ఎంపిక విషయంలో ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా రాణించాడని ప్రశంసించాడు. ఆ ఓపికే అతన్ని భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసిందని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు.

'ఈ తరం యువకులకు సూర్య కుమార్​ యాదవ్ ఒక రోల్​ మోడల్​. ప్రతిభ ఉన్నప్పటికీ.. భారత జట్టులో చోటు కోసం సుదీర్ఘ కాలం వేచి చూశాడు. చివరికి ఫలితం పొందాడు. ఇంతగా వేచి చూసే ఓపిక వేరొకరికి ఉండదేమో. టీమిండియాకు ఎంపిక కాకపోవడం వల్ల అతను నిరాశ చెందలేదు. తిరిగి ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో అడుగుపెట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్​ తరఫున రాణించాడు.'అని వీవీఎస్​ లక్ష్మణ్​ పేర్కొన్నాడు.

సూర్య ఆడిన మ్యాచ్​లు దాదాపు కఠిన పరిస్థితుల్లో ఆడినవేనని లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు. ముంబైకి ఎన్నో సందర్భాల్లో విజయాలను అందించాడని తెలిపాడు. 'సెలెక్టర్లు నీకు మొండిచెయ్యి చూపిస్తే నీ ప్రదర్శనతోనే వారు ఎంపిక చేసేటట్లు నిరూపించుకోమని మా కోచ్​ చెప్పేవారు. ఇప్పుడు సూర్య ఆటను చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తున్నాయి.

ఇంగ్లండ్​తో టీ20లకు తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందో లేదో తెలీదు. కానీ అందుకు అతను పూర్తిగా అర్హుడు" అని లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు. ఎన్నో రోజుల నుంచి ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా.. సూర్యకు భారత జట్టులో చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్ర దుమారం రేగింది. అయితే ఇంగ్లండ్​తో టీ20లకు మాత్రం అతన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కానీ తుది జట్టులో చోటు దక్కడంపై సందిగ్ధత నెలకొంది.

Story first published: Tuesday, March 9, 2021, 16:32 [IST]
Other articles published on Mar 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+