For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

VVS Laxman: ద్రవిడ్ నమ్మకాన్ని కేస్ భరత్ నిలబెట్టుకున్నాడు

VVS Laxman says Rahul Dravid had told me about KS Bharats skills long back

కాన్పూర్: టీమిండియా యువ వికెట్ కీపర్, తెలుగు తేజం కేఎస్ భరత్‌పై దిగ్గజ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ నిలబెట్టుకున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కకపోయినా.. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆఖరి నిమిషంలో మెడనొప్పితో బాధపడుతున్న వృద్దిమాన్ సాహా స్థానంలో వికెట్ కీపింగ్ చేసిన భరత్.. వికెట్ల వెనుక అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

మూడు కీలక వికెట్లు తీయడంలో భాగస్వామి అయ్యాడు. తొలుత విల్‌యంగ్‌(89) క్యాచ్‌ అందుకోవడమే కాకుండా అంపైర్‌ దాన్ని నాటౌట్‌గా ప్రకటించినా.. పూర్తి విశ్వాసంతో కెప్టెన్‌ రహానె రివ్యూకు వెళ్లేలా చేశాడు. అక్కడ విల్‌ ఔటని తేలడంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం రాస్‌ టేలర్‌ (11) వంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ను భరతే వికెట్ల వెనుక మళ్లీ క్యాచ్‌ అందుకొని పెవిలియన్‌ పంపాడు. ఇక టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టామ్‌ లాథమ్‌ (95)ను సైతం అతడే స్టంపౌట్‌ చేసి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. దాంతో భరత్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.

ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ మాట్లాడుతూ భరత్‌ కీపింగ్‌ నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. అతని గురించి ద్రవిడ్‌ తనతో ముందే ఓసారి చర్చించాడని పేర్కొన్నాడు. భారత్‌లో సాహా తర్వాత అంత మంచి వికెట్ కీపర్‌ భరతేనని ద్రవిడ్ చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.'భరత్‌.. సెలెక్టర్లు, కోచ్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా మంచి పరిణామం. వాళ్ల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా ఆడాడు. స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌లపై సరైన కీపర్‌ లేకపోతే పలు అవకాశాలు చేజారుతాయి. ఈరోజు భరత్‌ నుంచి మనం చూసింది అత్యద్భుతమైన ప్రదర్శన. కొద్ది రోజుల క్రితమే జట్టులోకి వచ్చి.. అనుకోకుండా అందిన అవకాశాన్ని నిర్భయంగా సద్వినియోగం చేసుకొన్నాడు. ఇది అతనికి మంచి అనుభవంగా పనికొస్తుంది. అతని కెరీర్‌ ముందుకు సాగడానికి ఇది మరింత తోడ్పడుతుంది. ఈ ప్రదర్శనతో అతనికి మంచి ఆత్మవిశ్వాసం లభిస్తుంది' అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, November 28, 2021, 19:14 [IST]
Other articles published on Nov 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+