For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని ప్రజలు అంతలా గౌరవించడానికి కారణం ఏంటో చెప్పిన లక్ష్మణ్‌!!

VVS Laxman says MS Dhoni was always emotionally detached from results as captain

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ వ్యవహార శైలి బాగుంటుంది కాబట్టే ప్రజలందరూ గౌరవిస్తున్నారని హైదరాబాద్‌ సొగసరి, భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. టీమిండియా ఫలితాల పట్ల భావోద్వేగపరంగా దూరంగా ఉండటమే ధోనీ అత్యంత విజయవంతం అవ్వడానికి కారణమని మాజీ క్రికెటర్ అన్నారు. ధోనీ ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇచ్చి యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. ప్రతీఒక్కరూ అతడు టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నారు.

ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచించడు:

ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచించడు:

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... 'టీమిండియాకు కెప్టెన్సీ వహించడం ఎవరికైనా కఠిన సవాలేనని నేను భావిస్తాను. ఎందుకంటే సారథిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంఎస్‌ ధోనీ ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచించడు. భావోద్వేగాల పరంగా దూరంగా ఉంటాడు. కేవలం క్రీడాభిమానులే కాదు కోట్లాది మంది భారతీయుల్లో అతడు ప్రేరణ నింపాడు. ప్రజల్లో మర్యాదపూర్వకంగా ఉండేవాడు. అందుకే అతడిని అంతలా గౌరవిస్తారు' అని అన్నారు.

వ్యవహార శైలి బాగుంటుంది:

వ్యవహార శైలి బాగుంటుంది:

తన ప్రవర్తన, వ్యవహారశైలితో భవిష్యత్తు క్రికెటర్లకు ఎమ్మెస్ ధోనీ ఆదర్శంగా నిలిచాడని హైదరాబాద్‌ సొగసరి వీవీఎస్‌ ప్రశంసించారు. 'క్రికెట్లో సాధించిన ఘనతలను బట్టి అభిమానుల్లో ప్రేమ పుడుతుంది. వ్యవహార శైలి బాగున్నప్పుడు, మర్యాదగా నడుచుకున్నప్పుడు మాత్రమే వారి నుంచి గౌరవం లభిస్తుంది. మహీ వీడ్కోలు పలకగానే.. సామాజిక మాధ్యమాల్లో స్పందన చూడండి. మాజీ క్రికెటర్లు, అభిమానులే కాదు సినిమా తారలు, సామాజిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సహా అంతా స్పందించారు. దాన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు' అని వీవీఎస్‌ పేర్కొన్నారు.

నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానన్నాడు:

నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానన్నాడు:

ఎంఎస్ ధోనీ 2006లో పాకిస్థాన్‌పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్‌పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ ఆశ్చర్యపరిచాడని భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. 'పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో మహీ సాంప్రదాయ ఫార్మాట్‌లో తొలి సెంచరీ బాదాడు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి గట్టిగా అరుస్తూ.. "నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఎంఎస్‌ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్‌లో ఇంతకుమించి నాకేం వద్దు" అని అన్నాడు. అక్కడే ఉన్న మేమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం' అని తెలిపారు.

రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో.. బార్బడోస్ అద్భుత విజయం!!

Story first published: Wednesday, August 19, 2020, 16:18 [IST]
Other articles published on Aug 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+