Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో.. బార్బడోస్ అద్భుత విజయం!!

Rashid Khan and Mitchell Santner shine Barbados Tridents tight win on opening day

ట్రినిడాడ్: ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో చేయడంతో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో తొలి రోజు గిరిజన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటగా బంతితో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన రషీద్.. అనంతరం తన కోటా నాలుగు ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రషీద్‌తో పాటు జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్ రాణించడంతో.. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుపై గెలిచిన బార్బడోస్ లీగ్‌లో శుభారంభం చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ ట్రైడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కాట్రెల్, తన్వీర్ చెలరేగడంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ చార్లెస్ (4), హోప్ (3), ఆండర్సన్ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో కైల్ మేయర్స్ (37), కెప్టెన్ జాసన్ హోల్డర్ (38) జట్టును ఆదుకున్నారు. ఆపై కార్టర్ (0), సీఫెర్ట్ (2) నిరాశపరిచారు. చివరలో రషీద్ ఖాన్ సహా మిచెల్ సాంట్నర్ (20) బ్యాట్ జులిపించడంతో ట్రైడెంట్స్ పోరాడే స్కోర్ చేసింది. కాట్రెల్, తన్వీర్ తలో రెండు వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనలో సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. ఆసీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ మొదటి రెండు ఓవర్లలో మూడు బౌండరీలు బాది మంచి ఊపులో ఉన్నాడు. మరోవైపు లెవిన్ ఎవిస్ కూడా పరుగులు చేశాడు. అయితే సాంట్నర్ ఓ అద్భుత బంతితో లిన్‌ను పెవిలియన్ చేర్చగా.. రషీద్ సూపర్ త్రోతో ఎవిస్‌ను వెనక్కిపంపాడు. ఈ సమయంలో జాషువా డా సిల్వా (41), బెన్ డంక్ (34) విజయం దిశగా నడిపించారు. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో సాంట్నర్, రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో సెయింట్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. నిర్ణీత ఓవర్లలో 174 పరుగులే చేసింది. సిల్వా పోరాడినా.. సెయింట్ 6 రన్స్ తేడాతో ఓడిపోయింది.

గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన మరో మ్యాచులో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచును వరణుడు ఆదిలోనే అడ్డుకున్నాడు. మ్యాచ్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో 17 ఓవర్లుగా అంపైర్లు కుదించారు. టాస్ గెలిగిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టేలర్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 33), హెట్‌మైర్ (41 బంతుల్లో 2 సిక్స్, 2 ఫోర్లతో 63 నాటౌట్), కీమో పాల్ (10 బంతుల్లో 1 ఫోర్‌తో 14) రాణించడంతో గయానా 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. లక్ష్య చేధనలో నైట్‌రైడర్స్ మరో రెండు బంతులు ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి విజయం సాధించింది. సునీల్ నరైన్ (50; 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‌హాఫ్ సెంచరీ చేశాడు.

Story first published: Wednesday, August 19, 2020, 16:02 [IST]
Other articles published on Aug 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+