For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పిన్‌ ఎదుర్కోలేక ఔటవ్వడమా? దారుణం: వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman says India batsmen getting out to spinners is cause of concern

పుణె: టీమిండియా టాపార్డర్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఔటవ్వడం విస్మయాన్ని కలిగించిందన్నాడు. సాధారణంగా భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అది స్వదేశంలో అయితే పండుగ చేసుకుంటారన్నాడు. కానీ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడటం స్పష్టంగా కనిపించిందన్నాడు.

స్వదేశంలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత ఆటగాళ్ల ఆట తీరును పునః సమీక్షించుకోవాలని, ఈ ధోరణి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. కేఎల్ రాహుల్ దురదృష్టవశాత్తు ఔటవ్వగా.. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బంతులను అర్థం చేసుకోలేక వెనుదిరిగారని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో తమ వికెట్లను ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌‌ ఆలీ , అదిల్‌ రషీద్‌లకు సమర్పించుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డేలో ఇంగ్లండ్‌ బౌలర్లు భారత్‌ను 48.2 ఓవర్లకే కుప్పకుల్చారు. ఇంగ్లండ్‌ స్పిన్‌ బౌలర్లు మొయిన్‌ ఆలీ(1/31), అదిల్‌ రషీద్‌(2/81), లివింగ్‌ స్టోన్‌(1/20) వికెట్లు తీశారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీని అత్యధికసార్లు ఔట్‌ చేసిన జాబితాలో మొయిన్‌ అలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక గ్రేమ్‌ స్వాన్‌, జేమ్స్‌ అండర్సన్‌, బెన్‌ స్టోక్స్‌లు కోహ్లీని ఎనిమిదిసార్లు ఔట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ను అత్యధిక సార్లు ఔట్‌ చేసింది టిమ్‌ సౌతీ.

Story first published: Monday, March 29, 2021, 16:58 [IST]
Other articles published on Mar 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+