
మంచి కమిట్‌మెంట్‌ను చూడాలనుకుంటున్నా:
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ... ' రెండో టెస్టులోనైనా రోహిత్ శర్మ, అజింక్య రహానేల నుంచి మంచి కమిట్‌మెంట్‌ను చూడాలనుకుంటున్నా. ఈ ఇద్దరూ మ్యాచ్‌ని గెలిపించాలి లేదా కాపాడాలని కోరుకుంటున్నా. రోహిత్, రహానే పరుగులు చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. క్రీజులో కుదురుకున్నాక పరుగులు చేయడం సులువే' అని అన్నాడు. చెన్నై చెపాక్ మైదానంలోనే ఫిబ్రవరి 13 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఫ్రెండ్లీ వికెట్ ఆశిస్తోంది. తొలి టెస్ట్‌కు పూర్తిగా ఫ్లాట్ వికెట్ ఇచ్చిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఏమాత్రం పోరాట పటిమ కనబడలేదు:
'తొలి టెస్టులో అజింక్య రహానేలో నాకు ఏమాత్రం పోరాట పటిమ కనబడలేదు. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేయడంతో క్లీన్ బౌల్డయ్యాడు. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. రెండో టెస్టులో ఇద్దరూ జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నా' హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు.

బెస్ట్ క్యాచ్ ఇదే:
వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ బ్యాట్‌తోనే కాదు స్లిప్ ఫీల్డింగ్‌లోనూ స్పెషలే. కెరీర్‌లో ఎన్నో క్యాచ్‌లను అతడు అందుకున్నాడు. అయితే కెరీర్‌లో బెస్ట్ క్యాచ్ మాత్రం ఇదే అంటూ బుధవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. 2004లో జరిగిన వీబీ సిరీస్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మణ్ ఆ క్యాచ్ అందుకున్నాడు. సెకండ్ స్లిప్‌లో ఉన్న వెరీవెరీ స్పెషల్.. కుడివైపు డైవ్ చేసి అందుకున్న ఆ లో క్యాచ్‌ను ఎవరో ట్విటర్లో పోస్ట్ చేస్తే.. ఇదే నా కెరీర్‌లో అందుకున్న బెస్ట్ క్యాచ్ అని లక్ష్మణ్ రీట్వీట్ చేశాడు.

నదీమ్ స్థానంలో అక్షర్:
ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరం టీమిండియా తుది జట్టు సెలెక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్‌ను కాదని షాబాజ్ నదీమ్‌కు చాన్స్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. సీనియర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి బరిలోకి దిగిన షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో తేలిపోయారు. అయితే జార్ఖండ్ స్పిన్నర్‌ను సెకండ్ టెస్ట్‌కు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
India vs England: మైకేల్ వాన్.. ఇవే తగ్గించుకుంటే మంచిది! అభిమానుల చురకలు!!


Click it and Unblock the Notifications












