కెరీర్లో వందో టెస్టు:
టీమిండియాతో చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కెరీర్లో వందో టెస్టు. ఈ మ్యాచులో రూట్ డబుల్ సెంచరీ (218)తో చెలరేగాడు. దీంతో వందో టెస్టును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఇక ఆఖరి రోజు పిచ్ విపరీతంగా టర్న్‌కు సహకరించడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ ముగిశాక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓ ట్వీట్ చేశాడు.

రూట్ అలాంటిదేమైనా అందుకున్నాడా?:
'నాథన్ లైయన్ వందో టెస్టు సందర్భంగా గబ్బా విజయం తర్వాత టీమిండియా అతడికి సంతకాలు చేసిన జెర్సీని బహూకరించింది. భారత్ ఓడిపోయాక.. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న జో రూట్ అలాంటిదేమైనా అందుకున్నాడా?. అది జరుగుతుందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా ధ్రువీకరిస్తారా?' అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవే తగ్గించుకుంటే మంచిది:
'వాన్.. కాస్త నోటి దురుసుతనం తగ్గించుకుంటే మంచిది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఎత్తి పొడుపులు, అపహాస్యం చేయడం తగదు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'మీరిప్పటికే 150 ఏళ్లు మమ్మల్ని దోచుకున్నారు. దేశభక్తులు ఎందరినో చంపేశారు. ముందు మీరు కోహినూర్ ఇవ్వండి. ఆ తర్వాత మేం టీ-షర్ట్ ఇవ్వడం గురించి ఆలోచిస్తాం' అని ఓ నెటిజన్ పంచ్ ఇచ్చాడు. 'రూట్‌కు భారత్ సంతకాలు చేసిన టీ-షర్ట్ ఇస్తుంది. మీరు టీమిండియాను గెలవనివ్వండి. మరీ అతిచేయకండి. పుంజుకోవడం భారత్‌కు అలవాటే. తర్వాత టెస్టులో ఇందుకు సిద్ధంకండి' అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం:
మొదటి మ్యాచులో ఓడిపోయిన తర్వాత సిరీస్ గెలిచిన రికార్డును ఓసారి పరిశీలిస్తే.. ఇంగ్లండ్‌పై భారత్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో ఇంగ్లండ్ 14 సార్లు సిరీస్‌లను కైవసం చేసుకున్నది. ఇదే సమయంలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం భారత్ ఐదు సార్లు సిరీస్‌ను గెలుచుకున్నది. అదికూడా టీమిండియా ఒకే ఒక్కసారే ఇంగ్లండ్‌ను ఓడించింది. 48 సంవత్సరాల క్రితం (1972-73) హోమ్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైస్ కెప్టెన్‌గా పృథ్వీ షా!!


Click it and Unblock the Notifications












