టీమ్ కాంబినేషన్ సూపర్.. అతనో ఫ్యూచర్ స్టార్: వీవీఎస్ లక్ష్మణ్

పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో టీమిండియా మంచి కాంబినేషన్‌తో బరిలోకి దిగిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రసిధ్ కృష్ణ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని ప్రశంసించాడు. కుల్దీప్ యాదవ్ రాకతో బౌలింగ్‌లైనప్ కూడా సమతూకంగా ఉందని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ లైవ్ షోలో మాట్లాడిన వీవీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బలమైన బ్యాటింగ్ లైనప్..
'బౌలింగ్ లైనప్ కూడా మంచి సమతూకంతో పాటు ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా అవకాశం దొరికితే సత్తా చాటాలని ఎదురు చూస్తున్న కుల్దీప్ తానేంటో నిరూపించుకుంటాడు. ప్రసిధ్ కృష్ణకు కూడా మంచి అవకాశం లభించింది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే మించింది ఏదీ ఉండదు. అతను ఖచ్చితంగా టీమిండియా ఫ్యూచర్ స్టార్ అవుతాడు. ఈ కాంబినేషన్‌తో టీమిండియా వరల్డ్ చాంపియన్‌కు గట్టి సవాల్ విసురుతోంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ బీకరంగా ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లతో బలంగా కనిపిస్తోంది. కృనాల్ పాండ్యాకు కూడా అవకాశం దక్కింది. 'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

కృనాల్, ప్రసిధ్ అరంగేట్రం..
ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున వన్డే క్రికెట్‌లోకి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కృనాల్ పాండ్యా, కేకేఆర్ బౌలర్ ప్రసిధ్ కృష్ట అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20 క్రికెట్ ఆడిన కృనాల్ తొలిసారి వన్డే అవకాశాన్ని అందుకోగా.. ప్రసిధ్ కృష్ణకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఇక మ్యాచ్‌కు ముందు కృనాల్ తన తమ్ముడు హార్దిక్ పాండ్యా చేతుల మీదు 233వ వన్డే క్యాప్ అందుకోగా.. రవిశాస్త్రి చేతుల మీదు ప్రసిధ్ కృష్ణ 234 క్యాప్ అందుకున్నాడు.

ధావన్, కోహ్లీ హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్(82 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ(56) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహిత్ శర్మ(28) నిరాశపరిచినా.. ధావన్, కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. రషీద్ వేసిన 24 ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా కొట్టిన ధావన్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రషీదే వేసిన 30 ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన విరాట్ అర్థ సెంచరీ సాధించాడు. అయితే మార్క్ వుడ్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడి విరాట్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 10 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications