For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2006లోనే ధోనీ రిటైర్మెంట్‌ ఇచ్చాడు: లక్ష్మణ్‌

VVS Laxman recalls time when MS Dhoni wanted to announce his retirement after slamming maiden Test ton

హైదరాబాద్: టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇచ్చి యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. ప్రతీఒక్కరూ అతడు టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే రెండు రోజుల క్రితమే కదా మహీ వీడ్కోలు పలికాడు.. మరి 2006లోనే రిటైర్మెంట్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా?!!. ‌అసలు విషయంలోకి వెళితే...

 నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా:

నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా:

ఎంఎస్ ధోనీ 2006లో పాకిస్థాన్‌పై తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు తన రిటైర్మెంట్‌పై ఓ కీలక వ్యాఖ్య చేశాడని, దాంతో అందరినీ ఆశ్చర్యపరిచాడని హైదరాబాద్‌ సొగసరి, భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. స్టార్‌స్పోర్ట్స్‌ షో 'క్రికెట్‌ కనెక్టెడ్‌'లో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్‌ పఠాన్‌తో లక్ష్మణ్‌ మాట్లాడుతూ... 'పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో మహీ సాంప్రదాయ ఫార్మాట్‌లో తొలి సెంచరీ బాదాడు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి గట్టిగా అరుస్తూ.. "నేనిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఎంఎస్‌ ధోనీ అనే నేను టెస్టుల్లో శతకం బాదాను. టెస్టు క్రికెట్‌లో ఇంతకుమించి నాకేం వద్దు: అని అన్నాడు. అక్కడే ఉన్న మేమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం' అని తెలిపాడు.

 అందరినీ బస్సులో తీసుకెళ్లాడు:

అందరినీ బస్సులో తీసుకెళ్లాడు:

టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడూ జట్టు మొత్తాన్ని ఓసారి అయోమయానికి గురిచేశాడని వీవీఎస్‌ లక్ష్మణ్‌ చెప్పాడు. 'అనిల్ కుంబ్లే నుంచి భారత కెప్టెన్సీ బాధ్యతలు మహీ స్వీకరించాడు. 2008లో అది ఆస్ట్రేలియా పర్యటన. నాగ్‌పూర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేటప్పుడు ఒక రోజు మైదానం నుంచి హోటల్ రూంకు వెళుతున్నాం. అకస్మాత్తుగా టీమ్ బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి.. వెనక్కి వెళ్లమని చెప్పాడు. అందరినీ తీసుకొని హోటల్‌ వరకు తీసుకెళ్లాడు. భారత జట్టు కెప్టెన్ బస్సును నడపడంతో మేమంతా ఆశ్చర్యపోయాం. ధోనీ అంటే అంతగా కలిసిపోతాడని, బయట జీవితాన్ని సరదాగా గడుపుతాడు' అని హైదరాబాద్‌ సొగసరి పేర్కొన్నాడు. ధోనీ చేసిన ఆ రెండు పనులు తానెప్పటికీ మర్చిపోనన్నాడు.

 మూడు ఐసీసీ ట్రోఫీలు:

మూడు ఐసీసీ ట్రోఫీలు:

ఎంఎస్‌ ధోనీ భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 ఒన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ‌ ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత 10,733 పరుగులు సాధించిన ఆటగాడిగా మహీ వన్డేల్లో భారత ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.

'ఇకపై ధోనీ ఎక్కువ సమయం దానికే కేటాయిస్తాడు'

Story first published: Monday, August 17, 2020, 15:44 [IST]
Other articles published on Aug 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+