'ఇకపై ధోనీ ఎక్కువ సమయం దానికే కేటాయిస్తాడు'

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శనివారం (ఆగస్టు 15) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక దాదాపు రెండు నెలలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020తో మహీ బిజీబిజీగా గడపనున్నాడు. ఆపై ధోనీ ఏంచేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇకపై ధోనీ ఎక్కువ సమయం ఆర్మీకే కేటాయించనున్నాడట. ఈ విషయాన్ని మహీ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే తెలిపాడు. మరోవైపు వాణిజ్య కార్యక్రమాలు, ఇతర కమిట్‌మెంట్లకు కూడా సమయం కేటాయిస్తాడని ఆయన చెప్పాడు.

అస్సలు ఊహించలేదు:
తాజాగా అరుణ్ పాండే మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్‌మెంట్ గురించి ప్రకటన వస్తుందని తెలుసు. కానీ గత నెలలో మెగా టోర్నీ 2022కి వాయిదా పడింది. అయితే ఇంత అకస్మాత్తుగా మహీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ధోనీ ఇప్పటికే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ వాయిదా పడటం కూడా మహీ మీద ప్రభావం చూపించిందనుకుంటాను. ప్రస్తుతం అతడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకే ఇలా అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ గురించి ప్రకటన చేశాడు' అని తెలిపాడు.

ఆర్మీతో ఎక్కువ సమయం:
'ఆగస్టు 15 ఆర్మీకి ఎంతో ప్రత్యేకం. అందుకే ఎంఎస్ ధోనీ ఆ రోజున తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని మహీ పొందారు. 2019 ప్రపంచకప్ తరువాత మహీ పారాచూట్ రెజిమెంట్‌తో కలిసి ఒక నెలకు పైగా శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ఇక మీదట మహీ ఆర్మీతో ఎక్కువ సమయం గడుపుతాడు. వాణిజ్య కార్యక్రమాలకు, ఇతర కమిట్‌మెంట్లకు కూడా సమయం కేటాయిస్తాడు. త్వరలోనే వీటి గురించి పూర్తి స్థాయిలో చర్చించి.. ముదుకు వెళతాం' అని అరుణ్ పాండే చెప్పాడు.

బ్రాండ్ విలువ తగ్గదు:
'చాలా సందర్భాల్లో అథ్లెట్ బ్రాండ్ విలువ పదవీ విరమణ తర్వాత తగ్గుతుంది. కానీ మహీ విషయంలో అలా జరగదు. 2019 ప్రపంచకప్ నుంచి మేం పది కొత్త బ్రాండ్లతో సైన్ అప్ చేశాం. అవి కూడా లాంగ్ టర్మ్ అసైన్‌మెంట్లు. ధోనీ అంటే క్రికెట్ మాత్రమే కాదు.. యూత్ ఐకాన్. అతని విజయాలు వ్యక్తిగతమైనవి కావు.. జట్టుకు, దేశానికి సంబంధించినవి. అందుకే మహీ విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు' అని ధోనీ స్నేహితుడు చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2022 వరకు:
ఐపీఎల్ 2022 వరకు ఎంఎస్ ధోనీ ఆడతాడు అని అరుణ్ పాండే ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఆగస్టు 20 తర్వాత అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐపీఎల్-13 కోసం క్రికెటర్లు సన్నద్దం అవుతున్నారు. ఇప్పటికే చెన్నైసూపర్ కింగ్స్ ప్రాంచైజీ ఆటగాళ్ల కోసం ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్ కోసం మహీ 14నే చెన్నై చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు చిదంబరం స్టేడియంలో సాధన చేస్తున్నాడు.
IPL 2020: 195 రోజుల తర్వాత.. హిట్టింగ్ మొదలెట్టిన రోహిత్ శర్మ (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications