Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రమోషన్!

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్, తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రమోషన్ లభించినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌, సెలెక్షన్ కమిటీతో పాటు భారత క్రికెట్ కార్యకలాపాలకు వీవీఎస్ లక్ష్మణ్ సూపిరియర్‌గా వ్యవహరించనున్నాడు.

టీమిండియా కోచ్ పదవిపై కొత్త బాంబ్: అసలు విషయం బయటపెట్టిన వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్ పదవిపై కొత్త బాంబ్: అసలు విషయం బయటపెట్టిన వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. మరోవైపు జాతీయ జట్టు కోచింగ్ వ్యవస్థ కూడా పరిశీలనలో ఉండటంతో బీసీసీఐ కీలక మార్పులు చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని అప్పగించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

VVS Laxman Likely to Be Appointed BCCI Director of Cricket Reports

లక్ష్మణ్‌కు అదనపు అధికారం..?

మరోవైపు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవి కాలాన్ని వన్డే ప్రపంచకప్ 2027 వరకు పొడిగించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటగాళ్ల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవితో అతనికి బాధ్యతలు మరింత పెరగనున్నాయి. అయితే ఈ నియామకంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటి?

భారత క్రికెట్ కార్యకలపాలకు హెడ్‌గా వ్యవహరించడమే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా లక్ష్మణ్ పని. సీనియర్ టీమ్, సెలెక్టర్లు, కోచ్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, భారత ఆటగాళ్ల మధ్య సమన్వయకర్తగా ఉంటాడు. అలాగే ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడం, ప్లేయర్స్‌ను డెవలెప్‌ చేయడం, అత్యుత్తమ ప్రణాళికలు రచించడంలో భాగస్వామ్యం కావడం వంటి బాధ్యతలు ఉంటాయి. సీఓఈలో ప్రస్తుతం లక్ష్మణ్ చేస్తున్న పనికి ఇది కొనసాగింపు మాత్రమే.

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్ సెలెక్షన్ వ్యవస్థపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ మార్పు చాలా కీలకం. సెప్టెంబర్‌తో అగార్కర్ పదవికాలం ముగియనుంది. అంతేకాకుండా ఇటీవల భారత జట్టు ఫలితాల నేపథ్యంలో కోచింగ్ సెటప్ కూడా పరిశీలనలో ఉంది.

గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న తేడా అదే: మహమ్మద్ కైఫ్

Also Read

గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న తేడా అదే: మహమ్మద్ కైఫ్

రాహుల్ ద్రవిడ్ అనంతరం భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి బదులుగా.. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ బాధ్యతలను లక్ష్మణ్ తీసుకున్నాడు. ఆటగాళ్లు తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సీఓఈ పనితీరుపై విమర్శలు వచ్చాయి. కానీ వాటిని లక్ష్మణ్ తిప్పికొట్టారు.

Story first published: Friday, August 14, 2026, 10:13 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+