Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో కొత్త అవార్డ్.. విన్నర్ అతనే! వైభవ్, మయాంక్ కాదు!

టీమిండియా తాత్కలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు‌ను ప్రవేశపెట్టాడు. కేవలం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడమే కాకుండా.. మ్యాచ్‌కు ముందు ఆటగాడి ప్రిపరేషన్ ఎలా ఉంది?

మ్యాచ్‌లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం వచ్చినా? రాకున్నా.. యాటిట్యూడ్ ఎలా ఉంది? జట్టు కోసం చూపించే ఉత్సాహం ఎలా ఉంది? ఇతర ఆటగాళ్లకు ఎంతలా అండగా ఉన్నాడు? అనే విషయాలను పరిగణనలోకి తీసుకోని ఈ అవార్డ్ ఇవ్వనున్నారు.జింబాబ్వే‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విజయానంతరం ఈ అవార్డ్‌ను ప్రవేశపెట్టారు.

VVS Laxman introduces Best Attitude award Here s 1st winner Not Vaibhav Sooryavanshi or Mayank Yadav

తిలక్ వర్మకే బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్

తొలి మ్యాచ్‌లో ఈ అవార్డ్‌ను వైస్ కెప్టెన్ తిలక్ వర్మ గెలుచుకున్నాడు.'మైదానంతో పాటు బయట కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నాం'అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. దాంతో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్ అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.

IND vs ZIM: మ్యాచ్ విన్నర్ ఔట్.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ZIM: మ్యాచ్ విన్నర్ ఔట్.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి కల్పించడంతో ఎన్‌సీఏ డైరెక్టర్ అయిన వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక కోచ్‌గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2026లో కూడా అతను జట్టును నడిపించనున్నాడు. గతంలో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను ప్రవేశపెట్టగా.. జట్టు ఫీల్డింగ్‌ను అద్భుతంగా మెరుగుపర్చింది.

జట్టు కోసం ఏమైనా చేస్తా..

ఈ క్రమంలో టీమ్ అటిట్యూడ్‌ను మార్చేలనే ఉద్దేశంతో లక్ష్మణ్ ఈ అవార్డ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్ గెలుచుకున్న తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు కోసం తాను ఏం చేయడానికైనా సిద్దమని, తన సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపాడు. మైదానం బయటే చేసే కఠోర శ్రమ తనను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుందని చెప్పాడు. ఈ అవార్డ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది.

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. భారత పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్(2/18) రెండు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) రికార్డ్ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య నేడు(జూలై 25) రెండో టీ20 జరగనుంది.

Story first published: Saturday, July 25, 2026, 13:17 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+