సీఓఈ కేవలం రిహాబ్ సెంటర్ కాదు.. మమ్మల్ని బద్నాం చేయొద్దు: వీవీఎస్ లక్ష్మణ్
భారత ఆటగాళ్ల వరుస గాయాల నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)పై వచ్చిన విమర్శలను ఆ సంస్థ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తిప్పికొట్టారు. బీసీసీఐ సీఓఈ కేవలం ఆటగాళ్ల పునరావస(రిహాబ్) కేంద్రం కాదని ఆయన స్పష్టం చేశారు. సీఓఈ ఆటగాళ్లు రాణించడంలో కూడా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చివరి నిమిషంలో మోకాలి గాయంతో శ్రీలంక పర్యటనకు దూరమవ్వడంతో సీఓఈ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. గాయాలతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగానే మళ్లీ గాయపడటం విమర్శలకు దారి తీసింది. బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తీ గాయాలతో జట్టుకు దూరమవడంతో సీఓఈ పనితీరు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్, సెలెక్షన్ కమిటీ మధ్య ఉన్న సమన్వయంపై ప్రశ్నలు తలెత్తాయి.

సీఓఈ పనితీరుపై బీసీసీఐ కూడా ఆగ్రహంగా ఉందని, పలువురు ఫిజియోలతో పాటు డాక్టర్లపై వేటు వేయనుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ విమర్శలపై స్పందించాడు. సీఓఈని కేవలం పునరావస కేంద్రంగా మాత్రమే చూడకూడదన్నాడు. క్రికెటర్లు రాణించడానకి సహాయపడటం కూడా సీఓఈ బాధ్యతేనని నొక్కి చెప్పాడు. ఆటగాళ్ల గాయాలకు సీఓఈని నిందించడం సరికాదన్నాడు.
'సీఓఈ కేవలం ఒక పునరావాస కేంద్రం మాత్రమే కాదు. క్రికెటర్లు రాణించడంలో సీఓఈది పెద్ద పాత్ర. ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా గాయాలు సర్వసాధారణం. అందుకే పర్యవేక్షణ వ్యవస్థ చాలా కీలకం. ఆటగాళ్ల గాయాలకు ఇతరులను నిందించడం సరికాదు. అలా చేస్తే బలిపశువులను వెతుకుతున్నట్లే అవుతుంది.'అని లక్మణ్ అభిప్రాయపడ్డాడు.
గాయాల బెడద పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా.. బెంగళూరులోని సీఓఈలో వీవీఎస్ లక్ష్మణ్‌ను కలిసి ప్లేయర్ ఇంజ్యూరి మేనేజ్‌మెంట్‌ను ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. 2025లో నితిన్ పటేల్ రాజీనామా చేయడంతో బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్‌కు పర్మినెంట్ హెడ్‌ను నియమించలేదు. దాంతో ఆ టీమ్‌పై తీవ్ర వర్క్‌లోడ్ పడుతోంది. ప్రస్తుతం ధనంజయ్ కౌశిక్ బెంగళూరు సీఓఈలో స్పోర్ట్స్ సైన్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

