Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: బుమ్రాను పక్కన పెడితే.. ఆ అనుభవం భువనేశ్వర్‌కు మాత్రమే ఉంది! జాగ్రత్తగా కాపాడుకోవాలి!

VVS Laxman feels Bhuvneshwar Kumar will play crucial role in T20 World Cup

అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్‌లో సీనియర్‌ పేస్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ భారత జట్టుకు కీలకం అవుతాడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. భువీ పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాల్సిన అవసరం టీమిండియా మేనేజ్మెంట్‌కు ఎంతో ఉందని సూచించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీసులో స్టార్ ఓపెనర్ రోహిత్ ‌శర్మకు ఓపెనింగ్‌ భాగస్వామిగా కేఎల్‌ రాహుల్‌ను పంపిస్తే బాగుంటున్నాడు. వచ్చే నవంబర్ మాసంలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

భువీకి మాత్రమే ఉంది

భువీకి మాత్రమే ఉంది

స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో జరిగిన చర్చలో భారత పేస్ విభాగం గురించి మాట్లాడిన వీవీఎస్‌ లక్ష్మణ్.. భువనేశ్వర్‌ కుమార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయడం సంతోషంగా ఉందన్నాడు. 'భువనేశ్వర్‌ కుమార్‌ ఫిట్‌నెస్‌ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతడు కీలకమైన బౌలర్‌. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి అవసరం ఎంతో ఉంది. జస్ప్రీత్‌ బుమ్రాను పక్కన పెడితే.. ఆరంభ, ఆఖరి ఓవర్లు వేసిన అనుభవం కేవలం భువీకి మాత్రమే ఉంది. అందుకే జట్టులో అతడో కీలక సభ్యుడు' అని లక్ష్మణ్ అన్నాడు.

పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి

పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి

'నవంబర్ నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అందుకే అతడి పనిభారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి. భువీ వందశాతం ఫిట్‌నెస్‌తో ఉండటం ఎంతో అవసరం. ఇంగ్లండ్ సిరీసులోనూ భువనేశ్వర్‌ రెండు మ్యాచులే ఆడొచ్చు. మ్యాచుల మధ్య మాత్రం అతడికి తప్పక విరామం ఇవ్వాలి' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్ సూచించాడు. ఐపీఎల్‌ 2020 సమయంలో అతడి తొడ కండరాల్లో చీలిక ఏర్పడింది. దాంతో ఐపీఎల్ లీగ్‌కు, సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న భువీ తిరిగి భారత జట్టులో చేరాడు.

రాహుల్‌ను తీసుకోవాలి

రాహుల్‌ను తీసుకోవాలి

ఇంగ్లండ్ సిరీసులో రోహిత్ ‌శర్మకు ఓపెనింగ్‌ జోడీగా కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవాలని వీవీఎస్‌ లక్ష్మణ్ సూచించాడు. 'రెండో ఓపెనర్‌ విషయానికి వస్తే ఇది చాలా కఠినమైన ప్రశ్న. రోహిత్ ‌ఎలాగూ ఓపెనింగ్ చేస్తాడు. నేనైతే రాహుల్‌ వైపు ఉంటాను. ఆ స్థానంలో కొన్నేళ్లుగా అతడు రాణిస్తుండటంతో భారత యాజమాన్యం అతడివైపే మొగ్గు చూపుతుందని నా అంచనా. సీనియర్, అనుభవం ఉన్న శిఖర్‌ ధావన్‌ సైతం ఉన్నాడు. రోహిత్‌, రాహుల్‌లో ఎవరు గాయపడ్డా, ఫామ్‌ కోల్పోయినా ధావన్ బ్యాకప్‌గా ఉంటాడు' అని వీవీఎస్‌ చెప్పుకొచ్చాడు.

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి

ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో పంత్‌కు అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ సలహా ఇచ్చాడు. 'పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్‌ చేసి ఆ జట్టుకు విజయాలు అందించడం చూశాం. ఎడమచేతివాటం గల బ్యాట్స్‌మన్‌గా ప్రత్యర్థి కెప్టెన్లకు చెమటలు పట్టిస్తాడు. టీ20 ప్రపంచకప్‌ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పంత్‌ చేరిక జట్టుకు లాభదాయకం. ఒకటి, రెండూ ఇన్నింగ్స్‌ చూసి అతడిని అంచనా వేయొద్దు. దీర్ఘకాలంలో ఆలోచించి అవకాశాలివ్వాలి. అతడికి తుది జట్టులో చోటు ఉంటుందనే భరోసా కల్పిస్తే ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు' అని పేర్కొన్నాడు.

Southampton: ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్ పోరులో ప్రేక్షకులకు అనుమతి!!

Story first published: Wednesday, March 10, 2021, 18:26 [IST]
Other articles published on Mar 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+