
పీటర్సన్ హాఫ్ సెంచరీ..
లక్ష్యచేధనలో భాగంగా 101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కీగన్ పీటర్సన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాసీ వాన్ డస్సెన్(95 బంతుల్లో 3 ఫోర్లతో 41 నాటౌట్), టెంబా బవుమా(58 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

పీటర్సన్ హాఫ్ సెంచరీ..
నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓవర్‌నైట్ బ్యాట్స్ కీగన్ పీటర్సన్, డస్సెన్ మంచి ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే పీటర్సన్ 65 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో పీటర్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 58 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అందుకున్న అతను మరింత ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో డస్సెన్ అతనికి అండగా నిలిచాడు.

సునాయసంగా..
అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న పీటర్సన్‌ను లార్డ్ శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన బవుమా.. డస్సెన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దాంతో సౌతాఫ్రికా 171/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ అనంతరం బవుమా, డస్సెస్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా వేగంగా పరుగులు చేస్తూ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. స్వల్ప లక్ష్యం కావడంతో సఫారీ బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడారు.

పంత్ సెంచరీ వృథా..
ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ టీమిండియా 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేనకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక ఈ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. పేలవ బ్యాటింగ్‌తో 198 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) శతకంతో పోరాటం చేయగా.. మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ(29) ఒక్కడు కొంత పోరాటం చేసాడు. దాంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. దీన్ని భారత బౌలర్లు కాపాడలేకపోయారు.

సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 223 ఆలౌట్( విరాట్ కోహ్లీ 79, రబడా 4/73)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210 ఆలౌట్(పీటర్సన్ 72, బుమ్రా 5/42)
భారత్ రెండో ఇన్నింగ్స్ 198 ఆలౌట్(రిషభ్ పంత్ 100 నాటౌట్, జాన్సెన్ 4/36)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 212/3 (కీగన్ పీటర్సన్ 82)


Click it and Unblock the Notifications












