Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vivrant Sharma: ఎవరు రా.. నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్?

హైదరాబాద్: వివ్రాంత్ శర్మ.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగుతున్న పేరు. ముంబై ఇండియన్స్‌తో అరంగేట్ర ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ బ్యాటర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగింది.

వివ్రాంత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్లుగా ఆడించగా.. ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ముఖ్యంగా యువ ప్లేయర్ వివ్రాంత్ శర్మ అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ బాది ఈ ఘనతను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అసాధారణ బ్యాటింగ్ కనబర్చిన వివ్రాంత్ శర్మ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

 vivrantsharma

జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ యువ సంచలనాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు. చివరి మ్యాచ్‌లో బరిలోకి దించగా అతను సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో అదిరిపోయే బ్యాటింగ్ చేసిన వివ్రాంత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో జమ్ము కశ్మీర్ జట్టును ఒంటిచేత్తో తొలిసారి నాకౌట్‌కు తీసుకెళ్లాడు. కీలక సెమీఫైనల్లో 124 బంతుల్లో 154 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌కు ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన వివ్రాంత్ శర్మ 191 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 6 వికెట్లు తీసారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన 4/13 కావడం విశేషం. ఈ ప్రదర్శనతోనే వివ్రాంత్ శర్మ కోసం వేలంలో ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. సన్‌రైజర్స్ అతన్ని దక్కించుకున్నప్పటికీ సరిగ్గా వాడుకోలేకపోయింది.

వివ్రాంత్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ను ఏకీపారేస్తున్నారు. అసలు ఇంత ట్యాలెంట్ ఉన్న ప్లేయర్‌ను ఇంతకాలం ఎలా పక్కన పెట్టారు? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు రా.. నువ్వు ఇంత టాలెండెట్‌గా ఉన్నావ్? అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. వివ్రాంత్ శర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69), మయాంక్ అగర్వాల్(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆకాశ్ మధ్వాల్(4/37) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నాడు. క్రిస్ జోర్డాన్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, May 21, 2023, 18:24 [IST]
Other articles published on May 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+