ఓవైపు టీమిండియా యువ క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతుంటే.. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్స్ విడాకులు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకునేందుకు సిద్దమవ్వగా.. తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.
ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 2004లో ఈ ఇద్దరికి పెళ్లికి కాగా.. ఇద్దరు కుమారులున్నాయి. ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్‌లు ఏజ్ క్రికెట్‌లో రాణిస్తున్నారు.

గతేడాది నవంబర్‌లో జరిగిన ప్రతీష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహార్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏజ్ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు.
రెండో కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ప్రతిష్టాత్మక అండర్ 16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో వేదాంత్ సెహ్వాగ్.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ2024-25లో 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వేదాంత్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ టోర్నీలో వేదాంత్ ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 5 వికెట్లు ఘనతను అందుకోవడం విశేషం. మరో రెండుసార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. వేదాంత్ సెహ్వాగ్ మినహా ఢిల్లీ బౌలర్లెవరూ 10 వికెట్లు తీయలేదు.
ఓవైపు పిల్లలు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటే.. మరోవైపు తల్లిదండ్రులు విడిపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వారి కెరీర్ కోసమైనా కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విడాకుల వార్తలను వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ ధ్రువీకరించలేదు.
ఇక ఆర్తి అహ్లావత్‌తో గొడవల నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ దేవాలయాలను సందర్శించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల సెహ్వాగ్ తిరుపతితో పాటు సౌతిండియాలోని పలు దేవాలయాలను ఒంటరిగా సందర్శించాడు. గత దీపావళి రోజు కూడా ఒంటరిగా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు.