Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై విజయాల బాట పట్టాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag suggests under-fire MI to pair up Jaydev Unadkat with Jasprit Bumrah

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడ్డ ఫైవ్ టైమ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సలహా ఇచ్చాడు. బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ బౌలింగ్ బలహీనంగా ఉందన్న సెహ్వాగ్.. ఆ సమస్యను అధిగమించేందుకు జయదేవ్ ఉనాద్కత్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఐపీఎల్‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్న జయదేవ్ ఉనద్కత్‌ను బెంచ్‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారో? తనకు అర్ధం కావడంలేదన్నాడు. తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ముంబై వరుస పరాజయాలపై స్పందించాడు.

బ్యాకప్ బౌలర్లు ఉన్నా..

బ్యాకప్ బౌలర్లు ఉన్నా..

'గత సీజన్‌ వరకు ముంబై జట్టులో నాథన్ కౌల్టర్ నైల్ ఉండేవాడు. జట్టులో ఏ బౌలరైనా విఫలమైనా? గాయపడినా అతను జట్టులోకి వచ్చేవాడు. బ్యాకప్ బౌలర్‌గా జట్టుకు అండగా ఉండేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ముంబై మేనేజ్‌మెంట్ బెంచ్‌లో ఉన్నవారికి తుది జట్టులో అవకాశం ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్ వంటి వారు ఇంకా బెంచ్‌కే పరిమితం అవుతున్నారు. అంతే కాకుండా సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్ వంటి యువ పేసర్‌లు కూడా జట్టులో ఉన్నారు.

IPL 2022 : Whos That Mumbai Indians Black Sheep ? - Sehwag | Oneindia Telugu
జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడించాలి..

జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడించాలి..

జట్టులో బాసిల్ థంపి, డానియల్ సామ్స్‌ అంతగా రాణించడం లేదు. వీరిద్దరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం​ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్‌ను తుది జట్టులో తీసుకునే సమయం వచ్చింది. అతనికి ఐపీఎల్‌లో చాలా అనుభవం ఉంది. గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా ఐపీఎల్ 2018 వేలంలో ఉనద్కత్‌ 11.5 కోట్లకు అమ్ముడు పోయాడు. అయితే అతను తన తర్వాత సీజన్‌లో అంతగా రాణించలేక పోయాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా బుమ్రాకు అతనే సరైన జోడి'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

నోటికాడి వడా పావ్..

నోటికాడి వడా పావ్..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ప్యాట్ కమిన్స్ సునామీ ఇన్నింగ్స్‌తో గెలిచే మ్యాచ్‌‌ను ముంబై చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. అయితే ఈ ఫలితాన్ని ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చమత్కారంతో కూడిన ట్వీట్ చేశాడు. 'నోటీకాడి వడ పావ్‌ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు'అని ట్వీట్ చేశాడు.

రోహిత్‌కు నేను బిగ్ ఫ్యాన్..

రోహిత్‌కు నేను బిగ్ ఫ్యాన్..

అయితే ఈ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న హిట్ మ్యాన్ అభిమానులు సెహ్వాగ్‌పై ట్రోలింగ్ దిగారు. తమ అభిమాన క్రికెటర్‌ను అవమానిస్తావా? అంటూ మండిపడ్డారు. తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుసుకున్న సెహ్వాగ్.. రోహిత్ అభిమానులకు మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.'వడా పావ్ అనేది ముంబై నగరానికి రిఫరెన్స్. అక్కడ అది చాలా ఫేమస్. రోహిత్ ఫ్యాన్స్ కూల్‌గా ఉండండి. నేను మీకంటే హిట్ మ్యాన్ బ్యాట్‌కు పెద్ద అభిమానిని.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Story first published: Friday, April 8, 2022, 19:15 [IST]
Other articles published on Apr 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+