
జై బజరంగ్ బలి..
అండర్సన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న బ్యాట్స్‌మన్ అంతా ముందుకొచ్చి 'జై బజరంగ్ బలి'అని ప్రార్థించాలని సూచించాడు. 'అండర్సన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ముందుకు రండి.. 'జై బజరంగ్ బలి'అని దేవుడిని ప్రార్థించండి. ఎందుకంటే అతను బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌కు ఓ భయం ఉంటుంది. బయటకు వెళ్లే బాల్స్‌తో ఏ ప్రమాదం లేకున్నా లోపలికి వచ్చే బంతులతో ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంటుంది. లోపలికి వచ్చిన బంతి ఎల్బీ అన్నా అవుతుంది. లేకుంటే క్లీన్ బౌల్డ్ అన్నా అవ్వడం ఖాయం.

కొత్తగా రహానే..
ఇక అండర్సన్ బౌలింగ్‌లో ఇప్పటి వరకు కోహ్లీ, పుజారానే ఔటయ్యేవారు. వారికి జతగా ఈసారి అజింక్యా రహానే కూడా తోడయ్యాడు. అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని రెగ్యులర్ కస్టమర్స్ కోహ్లీ, పుజారా. ఈ సారి వారికి రహానే కూడా జతయ్యాడు. రహానేను ట్రాప్ చేసి ఔట్ చేయగా.. కోహ్లీని అతని బలహీనతపై దెబ్బకొట్టి పెవలియన్ చేర్చాడు. పుజారాను సైతం ఆఫ్ స్టంప్ మీదుగా ఆడించి ఔట్ చేశాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
99 పర్సంటేజ్ వచ్చినా..
తాజాగా ట్విటర్ వేదికగా కోహ్లీ సెంచరీ కొరతపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరు స్టూడెంట్స్ మెరుగైన మార్కుల కోసం మళ్లీ పరీక్ష రాసారనే వార్తను షేర్ చేస్తూ ఇది కోహ్లీకి కూడా వర్తిస్తుందని తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు. కోహ్లీ కూడా సెంచరీ సాధిస్తేనే అభిమానులు సంతోషంగా ఉంటారని, అలా కాదని ఎన్ని పరుగులు చేసినా.. అతను ఫామ్‌లో లేనట్లేననే ఉద్దేశంలో ట్వీట్ చేశాడు. మృదుల్ అగర్వాల్, కావ్య చోప్రా అనే ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన జేఈఈ పరీక్షలో 99.99, 99.97 పర్సంటేజ్ సాధించారు. ఈ ఫలితాలకు సంతృప్తి పడని వారు మళ్లీ పరీక్షలు రాసి 100 పర్సంటేజ్ సాధించారు. 300 మార్కులు 300 సాధించారు. రోజులు 6-8 గంటలు చదివేవాళ్లమని చెప్పారు. ఈ క్రమంలో వీరిని ప్రస్తావిస్తూ సెహ్వాగ్ సెంచరీల కొరతపై సెటైర్లు పేల్చాడు.

భారీ స్కోర్‌కు బ్రేక్..
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 6 ఫోర్లతో 48 బ్యాటింగ్), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 129 ) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications
