For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్ ఆజామ్ కాదు.. అతని చెత్త నిర్ణయాలే పాకిస్థాన్‌ కొంపముంచాయి: వీరేంద్ర సెహ్వాగ్

పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ వాహాబ్ రియాజ్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాహాబ్ రియాజ్ చెత్త నిర్ణయాల కారణంగానే పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిందని అభిప్రాయపడ్డాడు.చీఫ్ సెలెక్టర్‌గా వాహాబ్ రియాజ్ పాకిస్థాన్ ప్రపంచకప్ టీమ్ సెలెక్షన్‌లో ఫేవరిటిజం చూపించాడని, తనకు అనుకూలంగా ఉండే ఆటగాళ్లను ఎంపిక చేశాడని సెహ్వాగ్ ఆరోపించాడు.

జట్టుకు పూర్తిగా దూరమైన మహమ్మద్ అమీర్ ఎంపికనే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న మహమ్మద్ అమీర్.. రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం.. ఆ వెంటనే పాకిస్థాన్ జట్టులోకి రావడం వెనుక వాహాబ్ రియాజ్ ఉన్నాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Virender Sehwag slams Wahab Riaz for selection bias after Pakistan s early exit from T20 World Cup 2024

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ జట్టు వైఫల్యం అనంతరం పీసీబీ కీలక మార్పులు చేసింది. పాకిస్థాన్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా వాహాబ్ రియాజ్‌ను నవంబర్‌లో నియమించింది.

2020 నుంచి పాకిస్థాన్ జట్టుకు దూరంగా ఉన్నమహమ్మద్ అమీర్.. ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంతో పాటు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వాహాబ్ రియాజ్ చేసిన తప్పిదాలే పాకిస్థాన్ పతనాన్నిశాసించాయని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ రియాజ్‌పై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.

'వాహాబ్ రియాజ్, మహమ్మద్ అమీర్.. ఓ టీవీ ఛానెల్‌లో కూర్చొని పాకిస్థాన్ జట్టును విమర్శించేవారు. కానీ ఈ రోజు ఈ ఇద్దరిలో ఒకరు పాకిస్థాన్ టీమ్ చీఫ్ సెలెక్టర్(రియాజ్) మరొకరు తుది జట్టులో కీలక ఆటగాడు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టును తీవ్రంగా విమర్శించినవారే ఆ జట్టులోని కీలక బాధ్యతలు అందుకున్నారు.

Virender Sehwag slams Wahab Riaz for selection bias after Pakistan s early exit from T20 World Cup 2024

అధికారం రావడంతో వాహాబ్ రియాజ్.. మహమ్మద్ అమీర్ నాతో ఉన్నాడని అతన్ని జట్టులోకి ఎంపిక చేశాడు. ఇది ఎలా ఉందంటే..? బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న అజిత్ అగార్కర్.. తన స్నేహితులైన వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌లను జట్టులోకి ఎంపిక చేసినట్లుంది. నేను చూసుకుంటా మీరు రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకోండని చెప్పినట్లు ఉంది.

చీఫ్ సెలెక్టర్ వంటీ కీలక బాధ్యత వచ్చినప్పుడు జట్టు మేలు కోరే నిర్ణయాలు తీసుకోవాలి తప్పా. అనుకూలంగా ఉండే ఆటగాళ్లను ఎంపిక చేయవద్దు. సెలెక్టర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సెలెక్టర్‌ అంటే చాలా కఠినంగా ఉండాలి.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికాతో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించలేదు. దాంతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.

Story first published: Thursday, June 20, 2024, 16:29 [IST]
Other articles published on Jun 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+