
సూర్యను పంపించాల్సింది..
తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన సెహ్వాగ్.. ముంబై మేనేజ్‌మెంట్ ప్రయోగాన్ని తప్పుబట్టాడు. అదో బిత్తిరి వ్యూహం అంటూ ఘాటుగా విమర్శించాడు. 'హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు పవర్ ప్లే అడ్వాంటేజ్‌గా మారేది. అతను కొన్ని మ్యాచ్‌ల్లో త్వరగా ఔటైనా పవర్ ప్లేను బాగా వాడుకుంటాడు. అలాంటి ఆటగాడిని కాదని గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను పంపించారు. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని డీమోట్ చేసి విఫలమవుతున్న ప్లేయర్‌పై నమ్మకం ఉంచారు. ఎంత ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కైనా ఆదిలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి ఉంటుంది.

మిస్ ఫైర్..
సూర్యను ఫస్ట్ డౌన్‌లోనే పంపించే ఉంటే బాగుండేది. పవర్ ప్లేలో అతను బ్యాటింగ్ చేస్తే ఇన్నింగ్స్‌కు కావాల్సిన మూమెంటమ్‌ను అందించేవాడు. సానుకూలమైన విషయం ఏంటంటే రోహిత్, సూర్యకుమార్ 15-16 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశారు. తమ బిగ్ హిట్టర్లు స్వేచ్చగా ఆడాలనే వ్యూహంతో ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ ప్రయోగం చేసిందనుకుంటా. కానీ ఈ వ్యూహం మిస్ ఫైర్ అయ్యింది. వారనుకున్నది జరగలేదు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

బాగా ఆడినా 130..
మరో మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా సైతం సెహ్వాగ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ పిచ్చి ప్రణాళికలను పక్కనపెట్టి సూర్యను మూడో స్థానంలోనే ఆడించాలని సూచించాడు. 'ముంబై ఇండియన్స్ బాగా ఆడకపోయినా 150 పరుగులు చేసేది. కానీ ఈ రోజు అద్భుతంగా ఆడినా కేవలం 130 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీనికి కారణం పవర్ ప్లేలో చెత్త బ్యాటింగ్. ఆదిలోనే వికెట్ కోల్పోయినా తర్వాత ముంబై ఆడిన తీరు దారుణం. ఇది వారి బ్యాటింగ్ శైలే కాదు. ఆరంభంలోనే 2-3 వికెట్లు పోయాయంటే అలా నెమ్మదిగా ఆడినా ఓ అర్థం ఉంటుంది. ఫామ్‌లో ఉన్న సూర్యను ఫస్ట్ డౌన్‌లో పంపించకపోవడమే దీనికి కారణం. అతని ప్లేస్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఉండి ఉంటే అలా డీమోట్ చేసేవారా?'అని జడేజా ప్రశ్నించాడు.

అలవోకగా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్), క్రిస్ గేల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్) రాణించారు.


Click it and Unblock the Notifications












