
న్యూఢిల్లీ: వరుస మ్యాచ్‌ల్లో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 44 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే పూర్తిగా తడబడింది. ఫాఫ్ డుప్లెసిస్(43) మినహా అంతా విఫలమయ్యారు. పేలవమైన షాట్లతో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు.
ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ తీరును ప్రస్తావిస్తూ సెహ్వాగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. క్రీజులో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాట్స్‌మెన్‌కు తదుపరి మ్యాచ్‌లోనైనా గ్లూకోజ్ ఎక్కించి పంపించాలాని ట్వీటర్ వేదికగా విమర్శించాడు. 'చెన్నై బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. తదుపరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వెళ్లేముందు బ్యాట్స్‌మెన్‌కు గ్లూకోజ్ ఎక్కించాలి'అని వీరు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్ ), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడా 3 వికెట్లు పడగొట్టాడు.
అంతకు ముందు షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగులతో ఓటమిపాలైంది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 200 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో చెన్నై టీమ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. అంబటి రాయుడు, సురేశ్ రైనా లేని లోటు స్పష్టమవుతుందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ప్లేమింగ్ తెలిపాడు. స్పిన్ బౌలర్లు కూడా తేలిపోవడం తమ ఓటమికి కారణమన్నాడు. రాయుడు వస్తే పరిస్థితులు చక్కబడుతాయని ధోనీ అభిప్రాయపడ్డాడు.