Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంగక్కర.. వాడు అవసరమా?: సెహ్వాగ్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతని చెత్త కెప్టెన్సీ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ రాయల్స్‌ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను కొనసాగించే విషయంపై రాజస్థాన్ రాయల్స్‌ పునరాలోచన చేయాలని సూచించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కాపాడుకోలేకపోయింది.

కెప్టెన్సీకి పరాగ్ సరైనోడేనా..?

తాజాగా ఈ మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన సెహ్వాగ్.. రియాన్ పరాగ్‌‌పై మండిపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ సారథ్య బాధ్యతలకు రియాన్ పరాగ్ సరైన ఎంపికేనా అని టీమ్ మేనేజ్‌మెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ప్రధాన స్పిన్నర్లైన రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లతో ఒక్కో ఓవర్‌ మాత్రమే వేయించడాన్ని రియాన్ పరాగ్ తప్పుబట్టాడు. ఈ చెత్త నిర్ణయాల కారణంగానే రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

బ్యాటర్‌గానూ రియాన్ పరాగ్ విఫలమవ్వడం జట్టుపై ప్రభావం చూపుతుందన్నాడు. పరాగ్ తనతో సహా మొత్తం ఎనిమిది మంది బౌలర్లను ప్రయత్నించాడని, కానీ కీలకమైన బౌలర్లకు మళ్లీ బంతి ఇవ్వలేదని మండిపడ్డాడు. జడేజా తన ఒక్క ఓవర్‌లో 11 పరుగులిచ్చాడని పక్కనపెట్టడం సరికాదన్నాడు. బౌలింగ్ మార్పుల విషయంలో రియాన్ పరాగ్ మరింత ఫోకస్ పెట్టాలని హితవు పలికాడు.

పరుగులిస్తే బౌలింగ్ ఇవ్వరా..?

'రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా కేవలం ఒక్కో ఓవర్‌ మాత్రమే బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరూ రాజస్థాన్ ప్రధాన స్పిన్నర్లు. వారి మొదటి ఓవర్‌లో పరుగులు సమర్పించుకున్నా.. పుంజుకోవడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. కొన్నిసార్లు బౌలర్ పరుగులివ్వొచ్చు. కానీ కనీసం రెండో ఓవర్‌ అయినా ప్రయత్నించాలి. వాళ్ళిద్దరూ కాకపోతే ఇంకెవరు వికెట్లు తీస్తారు? పార్ట్‌టైమ్ బౌలర్లు కేవలం ఓవర్‌ పూర్తిచేయాలని మాత్రమే ఆలోచిస్తారు. రియాన్ పరాగ్ తన కెప్టెన్సీ గురించి ఆలోచించాలి, అలాగే మేనేజ్‌మెంట్ అతను సరైన కెప్టెనా కాదా అని నిర్ణయించుకోవాలి.’ అని వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 9 బంతుల్లో 7 పరుగులే చేసి వెనుదిరిగాడు. అతని వైఫల్యం రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది.ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్.. కేవలం 88 పరుగులు మాత్రమే సాధించాడు. అతని స్ట్రైక్-రేట్ 112.82 కాగా, సగటు 12.57గా ఉంది.

కెప్టెన్సీపై పేలవ ఫామ్ ప్రభావం..

ఒక కెప్టెన్ బ్యాటింగ్‌లో పరుగులు చేయకపోతే, అది మైదానంలో అతని నిర్ణయాల పైనా ప్రభావం చూపుతుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 'కెప్టెన్‌గా ఉండి పరుగులు చేయకపోతే, అది 100 శాతం కెప్టెన్సీని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సదరు కెప్టెన్ పరుగులు గురించి ఆలోచిస్తాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో 100 పరుగులు కొట్టాడు. సీనియర్ ఆటగాడిగా ఎందుకు పరుగులు చేయలేకపోతున్నాననే బాధ రియాన్ పరాగ్‌కు కలుగుతుంది.’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌తో తన తదుపరి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.

Story first published: Sunday, April 26, 2026, 18:15 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+