
లలిత్‌కు బౌలింగ్ ఇచ్చి..
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి 42 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ లలిత్ యాదవ్‌తో బౌలింగ్ చేయించి రిషభ్ పంత్ ఘోర తప్పిదం చేశాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆ ఓవర్‌లో నితీశ్ రాణా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదగా.. దినేశ్ కార్తీక్ కూడా ఒక ఫోర్ కొట్టేశాడని, దాంతో.. ఆ ఓవర్‌లో 20 పరుగులు రాగా.. సమీకరణం 36 బంతుల్లో 32 పరుగులుగా మారి మ్యాచ్ కోల్‌కతా వైపు మళ్లిందన్నాడు. ఒకవేళ ఆ ఓవర్‌ను పేసర్ అన్రిచ్ నోర్జ్‌తో వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

రాణా గురించి తెలిసి కూడా..
కెరీర్ ఆరంభం నుంచి నితీశ్ రాణాతో కలిసి రిషభ్ పంత్ మ్యాచ్‌లు ఆడడాని, అతని బ్యాటింగ్ గురించి అవగాహన ఉండి కూడా.. లలిత్ యాదవ్‌తో బౌలింగ్ చేయించి ఘోర తప్పిదం చేశాడన్నాడు. ఒకవేళ ఆ ఓవర్‌ని నోర్జ్‌తో వేయించి ఉంటే.. రాణా ఔటన్నా అయ్యేవాడిని లేకుంటే, పరుగులైన కట్టడి చేసేవాడని చెప్పాడు. అప్పుడు పరుగులు, బంతుల మధ్య అంతరం పెరిగి ఒత్తిడి పెరిగి ఢిల్లీకి మంచి అవకాశం ఉండేదన్నాడు. ఆ ఓవర్ తర్వాత రబడా కూడా ధారాళంగా పరుగులిచ్చినప్పటికీ.. మ్యాచ్ మలుపు తిరిగింది మాత్రం లలిత్ ఓవర్‌లోనేనని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

సెహ్వాగ్ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్(అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున వీరేంద్ర సెహ్వాగ్ 85 ఇన్నింగ్స్‌లో 2382 పరుగులు చేయగా.. కేకేఆర్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో 39 పరుగులు చేయడం ద్వారా పంత్ అతని రికార్డును అధిగమించాడు.
ఢిల్లీ తరఫున ఇప్పటివరకు 75 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 2390 పరుగులు చేశాడు. పంత్ ఖాతాలో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలుండగా, సెహ్వాగ్ ఓ సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. వీరిద్దరి తర్వాత ఢిల్లీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉంది. అయ్యర్.. 82 ఇన్నింగ్స్‌ల్లో 2291 రన్స్ చేశాడు.

కేకేఆర్ సూపర్ విక్టరీ..
ఇక ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. లీగ్‌లో ఐదో విజయంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నైట్‌రైడర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.2 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్), శుభ్‌మన్ గిల్(33 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30) రాణించారు. చివర్లో సునీల్ నరైన్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/13) మూడు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబడా చెరొక వికెట్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications
