Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే ఆర్‌సీబీ కథ ఎప్పుడో ముగిసేది: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag says Virat Kohli used to drop players after 2-3 games

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లే ఆఫ్స్ చేరడంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగి ఉంటే ఆ జట్టు ఎప్పుడో ఇంటిదారి పట్టేదన్నాడు. ఆర్‌సీబీ విజయాల్లో నయా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ పాత్ర కూడా ఉందని చెప్పాడు. వారిద్దరి కారణంగానే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోగలిగిందని అభిప్రాయపడ్డాడు. జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా మంచి ఫలితాలు రాబట్టారని కొనియాడాడు.

 కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..

కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌ల్లో సరిగ్గా ఆడకపోతే తుది జట్టు నుంచి తప్పించేవాడని చెప్పాడు. కానీ బంగర్, డుప్లెసిస్ మాత్రం ఆటగాళ్లపై నమ్మకం ఉంచి కొనసాగించారని తెలిపాడు. అదే ఆర్‌సీబీకి సక్సెస్‌కు కారణమైందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన ఆర్‌సీబీ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ముంబై ఇండియన్స్ సహకారంతో ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంపై క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ఇదే జోరును కొనసాగిస్తే టైటిల్ కూడా గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

 సంజయ్ బంగర్ హెడ్ కోచ్‌గా...

సంజయ్ బంగర్ హెడ్ కోచ్‌గా...

'సంజయ్‌ బంగర్‌ హెడ్‌కోచ్‌గా రావడం.. కొత్త కెప్టెన్‌ చేరిక ఆర్‌సీబీ వ్యూహాల్లో మార్పులు తీసుకువచ్చింది. గతంలో విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నపుడు.. ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌లలో సరిగా ఆడకపోతే తుదిజట్టు నుంచి తప్పించే వాడు. కానీ బంగర్‌, డుప్లెసిస్‌ టోర్నీ ఆసాంతం ఒకరిద్దరు మినహా అందరినీ కొనసాగించారు. అనూజ్‌ రావత్‌ మినహా చెత్త ప్రదర్శన కారణంగా వారు ఎవరినీ పక్కనపెట్టిన దాఖలాలు కనిపించలేదు. నిలకడగా ముందుకు సాగడం వారికి కలిసి వచ్చింది.

ఈసారి నలుగురు...

ఈసారి నలుగురు...

గతంలో కంటే ఆర్‌సీబీ బలంగా ఉంది. గతేడాది విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను ఔట్ చేస్తే సరిపోతుందని ప్రత్యర్థి జట్టు భావించేవి. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ రాణిస్తున్నారు. ఇదే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడానికి కారణమైంది'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 24, 2022, 17:24 [IST]
Other articles published on May 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+