Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka:అర్జున రణతుంగ..టీమిండియాను గప్పుడేమో అంటివి!జరగిప్పుడు మాట్లాడరాదే: సెహ్వాగ్

Virender Sehwag Says This Indian B Team Can Even Win On Virat Kohlis Team In England
Ind Vs SL : Sehwag Slams Arjuna Ranatunga, Teamindia ని బీ టీమ్ అన్నావో

ఢిల్లీ: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రధాన జట్టు టెస్టుల కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ సారథ్యంలో యువకులతో కూడిన మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. లంక పర్యటనలో భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, యుజ్వేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా లాంటి సీనియర్లతో పాటు.. ఐపీఎల్, దేశవాళీ టోర్నీలలో సత్తాచాటాటిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. సిరీస్ ఆరంభానికి ముందు ధావన్ కెప్టెన్సీలోని జట్టుని భారత-బీ జట్టుగా లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభివర్ణించాడు.

శ్రీలంకను అవమానించడమే

శ్రీలంకను అవమానించడమే

బీసీసీఐ బీ టీమ్‌ పంపడం తమదేశ క్రికెట్‌‌ను అవమానించడమే అని అర్జున రణతుంగ ఫైర్ అయ్యాడు. ఈ జట్టు‌తో ఆడితే శ్రీలంక పరువు పోతుందని పేర్కొన్నాడు. 'ఇలా భారత రెండో జట్టు శ్రీలంక పర్యటనకు రావడం మా దేశ క్రికెట్‌‌ను అవమానించడమే. టెలివిజన్ మార్కెటింగ్ అవసరాల నేపథ్యంలో ఈ సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బీసీసీఐ తమ బలమైన జట్టును ఇంగ్లండ్‌కు పంపించి.. బలహీనమైన ఇంకో జట్టును శ్రీలంకకు పంపించింది. దీనికి మా దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణం' అని రణతుంగ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలను ఆదేశ మాజీలు కూడా అంగీకరించలేదు.

సత్తాచాటిన యువ భారత్:

సత్తాచాటిన యువ భారత్:

ఇక కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో యువ భారత్ సత్తాచాటింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో చమికా కరుణరత్నె(43 నాటౌట్‌; 35 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్‌ అందించాడు. చరిత అసలంక (38), కెప్టెన్ దాసన్ షనకా (39) పర్వాలేదనిపించారు. 263 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), శిఖర్ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6x4, 1x6) మంచి ఆరంభం ఇచ్చారు. ఆపై యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో 8x4, 2x6), సూర్యకుమార్‌ యాదవ్ (31; 20 బంతుల్లో 5x4) ధాటిగా ఆడి సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్‌ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణి కొట్టింది.

India vs Sri Lanka:35 ఏళ్ల వయసులో శిఖర్ ధావన్ అరుదైన రికార్డు..తొలి వన్డేలో గబ్బర్ నెలకొల్పిన రికార్డ్స్ ఇవే?

భారత్ ఏ టీమ్‌ని పంపినా.. అది బీ టీమ్ కాదు:

భారత్ ఏ టీమ్‌ని పంపినా.. అది బీ టీమ్ కాదు:

క్రిక్‌బజ్‌తో జరిగిన ఓ షోలో అర్జున రణతుంగ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. సిరీస్ ముందు భారత జట్టును బీ టీమ్ అని అన్నారు కదా.. ఇప్పుడు ఏం మాట్లాడుతారు? అని ఆయన సెటైర్ వేశాడు. ధావన్ సేన బీ టీమ్ కాదు.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేనను కూడా ఓడించగలదు అని వీరూ అన్నాడు. 'అర్జున రణతుంగ లంకకు వెళ్లిన భారత జట్టును బీ టీమ్ అన్నాడు. ఆ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందిగానే ఉన్నాయి. మేము ఆయన అభిప్రాయంతో ఏకీభవించం. ధావన్ సేనను బీ టీమ్ అనుకోవచ్చు. అయితే భారత్ ఏ టీమ్‌ని పంపినా.. అది బీ టీమ్ కాదు. ఈ విషయాన్నీ మీరు గుర్తుంచుకోవాలి' అని సెహ్వాగ్ అన్నాడు.

కోహ్లీ సేనని కూడా ఓడించగలదు:

కోహ్లీ సేనని కూడా ఓడించగలదు:

'ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ద్వారా చాలా మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఎంతో ప్రతిభ ఉన్న కుర్రాళ్లు టీమిండియాకు ఉన్నారు. వారిని కేవలం ఒక టీమ్‌కి ఇప్పుడు పరిమితం చేయలేం. ఇప్పుడు శ్రీలంకలో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్ టూర్‌లోని కోహ్లీ సేనని కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఓడించగలదు. అంత పటిష్టంగా ఉంది ధావన్ సేన. లంకలో ఉన్న భారత జట్టును బీ టీమ్ అనొద్దు' అని వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఒప్పుకోవడమే గొప్ప విషయమని, ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో నుంచి భారత్‌తో జరిగే ఈ సిరీస్‌లు లంక క్రికెట్ బోర్డు కోలుకునేలా చేస్తాయని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా పేర్కొన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, July 19, 2021, 14:15 [IST]
Other articles published on Jul 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+