
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. నెమ్మదైన వికెట్‌పై సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ మరి దారుణంగా బ్యాటింగ్ చేశారని సెహ్వాగ్ తెలిపాడు. వారి నెమ్మదైన బ్యాటింగ్ తనకు నిద్రమాత్రలుగా పనిచేసిందన్నాడు. వారి ఆటను చూస్తూ మెళ్లగా నిద్రలోకి జారుకున్నానన్నాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను జాసన్ రాయ్, వృద్దిమాన్ సాహా ప్రారంభించారు. అయితే ఈ ఇద్దరు త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్, ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ వికెట్ నెమ్మదిగా ఉండటంతో వారి ఆట మరి స్లోగా ముందుకు సాగింది. టీవీలో సైతం మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. విలియమ్సన్ 26, గార్గ్ 21 అని వచ్చింది. ఆ తర్వాత అబ్దుల్ సమద్ మూడు సిక్స్‌లతో జోరు కనబర్చాడు.
కానీ 25 పరుగులు చేసిన అతను కూడా త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ ఆట నెమ్మదిగా ఉండటంతో నిద్రమాత్రలు వేసుకున్నట్లు అనిపించింది. గేమ్ ఇంకా నాలుగు ఓవర్లు ఉందనగా నేను నిద్రపోయాను. సడన్‌గా లేచి చూసేసరికి హైదరాబాద్ 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 116 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.
శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 10 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లతో 25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేశ్ కార్తీక్(18 నాటౌట్) బౌండరీతో విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తలో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది.