Virender Sehwag: కెరీర్ ప్రారంభంలో ఇంగ్లీష్ మాట్లాడలేక మెంటల్ టార్చర్ అనుభవించా!

న్యూఢిల్లీ: 'ఇంగ్లీష్'- చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఇంగ్లీషేతర ప్రజలు తమ జీవితంలో ఏదో సందర్భంలో ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ రాక ఇబ్బందిపడ్డవారే. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీష్ మాట్లాడటం కోసం తప్పస్సే చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం కెరీర్ ప్రారంభంలో ఇంగ్లీష్ రాక.. మెంటల్ టార్చర్ అనుభవించాడంట! ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ 'కౌన్ బనేగా కరోడ్‌పతి'షోలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కలిసి పాల్గొన్న సెహ్వాగ్.. ఓ ప్రశ్నకు సమాధానంగా జరిగిన చర్చలో చెప్పుకొచ్చాడు.

నవోమి ఒసాక గురించి అడుగుతూ..
శుక్రవారం టెలికాస్ట్ అయిన ఈ ప్రోగ్రామ్‌లో సెహ్వాగ్,దాదా రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఈ జోడీ 40 వేలు గెలుచుకున్న తర్వాత.. అమితాబ్.. జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకకు సంబంధించిన ప్రశ్నను అడిగాడు. ఇటీవల మానసిక సమస్యలతోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఒసాక వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్న తర్వాత ఆటగాళ్ల మానసిక సమస్యల గురించి అమితాబ్ దిగ్గజ క్రికెటర్లతో చర్చించాడు. ప్రస్తుతం ఆటగాళ్లు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కరోనా బయో బబుల్స్ కారణంగా పరిస్థితులు మరి దారుణంగా తయారయ్యాయని దాదా చెప్పుకొచ్చాడు. ఇదే సమస్యతో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ బెన్ స్టోక్స్.. ఆటకు విరామం ప్రకటించాడని దాదా ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆటగాళ్లకు మానసిక సమస్య కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని తెలిపాడు.

ఇంగ్లీష్ మాట్లాడలేక..
ఇదే చర్చలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఇంగ్లీష్ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డానని, మానసిక వేదనను అనుభవించానని చెప్పుకొచ్చాడు. తన ఫస్ట్ ఇంటర్వ్యూను హిందీలో చేయాలని రవిశాస్త్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసానని గుర్తు చేసుకున్నాడు. కానీ రవిశాస్త్రి మాత్రం ఇంగ్లీష్‌లో ప్రశ్నలు అడిగాడని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్న నజఫ్‌గర్ నవాబ్.. అనర్గళమైన బాషతో కామెంటేటర్‌గా కూడా పనిచేశాడు. కానీ హిందీలో మాట్లాడటానికే సెహ్వాగ్ ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. సోషల్ మీడియా చాలా చురుకుగా ఉండే సెహ్వాగ్.. ట్వీట్లను సైతం హిందీలోనే చేస్తుంటాడు. పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో హిందీ మాట్లాడటానికే ఇష్టపడుతుంటాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సెహ్వాగ్.. భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు హిందీ వ్యాఖ్యానం చేస్తున్నాడు. రిటైర్మెంట్ అనంతరం హిందీ కామెంటేటర్‌గా సెహ్వాగ్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.

రూ. 25 లక్షలు సొంతం..
ఈ షోలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రూ.25లక్షలు గెలిచారు. అయితే సెహ్వాగ్, గంగూలీ రూ.50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆజాద్ హింద్ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?. జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా.. ఆప్షన్స్ ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో భారత మాజీలు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. సరైన సమాధానం జర్మనీ. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం వారు విరాళంగా ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications