For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏబీ డివిలియర్స్ పేరు మరచినా.. మిస్టర్ 360 అనే ట్యాగ్ చిరస్థాయిగా ఉండిపోతుంది: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag says People may forget AB de Villiers real name, but will always remember Mr. 360
Mr. 360 AB de Villiers చిరస్థాయిగా ఉండిపోతుంది... ABD పై Sehwag ప్రశంసల జల్లు || Oneindia Telugu

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో ప్రత్యేకమైన ఆటగాడని కొనియాడాడు. ప్రజలంతా ఏబీ డివిలియర్స్ పేరు మరిచిపోయినా.. అతని బిరుదైన మిస్టర్ 360 అనే ట్యాగ్‌ను మాత్రం అస్సలు మరిచిపోరని తెలిపాడు. ఇక వైవిధ్యమైన ఆటతీరుతో మైదానం నలుమూలల ఆడే ఏబీడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్.. అప్పటి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు దూరమైనా అతనిలోని సత్తా మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ప్రతీ సీజన్‌లోనూ నిరూపిస్తున్నారు.

 క్రికెట్‌కు దూరమైనా..

క్రికెట్‌కు దూరమైనా..

కరోనా కారణంగా గతేడాది పూర్తిగా ఇంటికే పరిమితమైన ఏబీడీ.. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభమయ్యేవరకు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈ సీజన్‌తోనే నేరుగా బ్యాట్ అందుకున్న డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌కే హైలైట్. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్‌ను చీల్చించెండాడాడు. తాజాగా క్రిక్ బజ్‌తో మాట్లాడుతూ ఈ ఇన్నింగ్సేనే ప్రస్తావించిన సెహ్వాగ్.. ఏబీడీలా మరే ఆటగాడు ఆడలేడని ప్రశంసించాడు.

 మిస్టర్ 360 మరవలేరు...

మిస్టర్ 360 మరవలేరు...

'ప్రజలంతా ఏబీ డివిలియర్స్ అసలు పేరు మర్చిపోవచ్చు. కానీ మిస్టర్ 360 డిగ్రీ అనే అతని ట్యాగ్‌ను మాత్రం అస్సలు మరిచిపోరు. అతనికి మరో పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. క్రికెట్‌లోకి కొత్తగా ఎంత మంది వచ్చినా.. ఏబీడీ ప్రత్యేకత ఏబీడీదే. మిస్టర్ 360 డిగ్రీ అతనికి సరిగ్గా సరిపోయే పేరు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేశాడు. అనంతరం తప్పుడు బంతులను వదిలేసానని గ్రహించాడు. ఆ వెంటనే అదే తరహా బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. మళ్లీ అదే తరహా బంతిని ఊహించాడు. కానీ షార్ట్ పిచ్‌డ్ బాల్‌ రావడంతో దాన్ని అద్భతంగా సిక్సర్ కొట్టాడు.

 అదే కరెక్ట్ నేమ్..

అదే కరెక్ట్ నేమ్..

అలా ఆడటం ఏబీ డివిలియర్స్ ఒక్కడికే సాధ్యం. మరే ఆటగాడు కూడా అతనిలా ఆడలేరు. ఔట్ సైడ్ ఆఫ్ బంతి కాదనుకొని పొజిషన్‌కు వెళ్లకుంటే షార్ట్ బాల్‌కు ఔటయ్యేవాడు. అలాంటి

షాట్లు డివిలియర్స్ ఒక్కడే ఆడగలడు. కాబట్టి అతనికి ఎలాంటి బిరుదులు, పాటలు, కవితలు అవసరం లేదు. మిస్టర్ 360 అనేదే సరైన పేరు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. టీ20ల్లో దుమ్మురేపిన ఏబీడీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఏబీడీ.. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

 ఒక్క పరుగుతో..

ఒక్క పరుగుతో..

ఇక సెహ్వాగ్ ప్రస్తావించిన ఢిల్లీ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నడిపించి.. చివర్లో మార్క్ స్టోయినిస్‌ను చితక్కొట్టాడు. అతను వేసిన ఆఖరి ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌‌తో ఏకంగా 23 రన్స్ పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఒక్క పరుగుతో ఆఖరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్‌లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ విజయం లాంచనమైంది.

Story first published: Sunday, May 9, 2021, 16:19 [IST]
Other articles published on May 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+