Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ ఎంతో నయం: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కంటే లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ ఎంతో నయమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా రాహుల్‌తో సంజూ శాంసన్‌ పోటీపడలేడని, వీరి మధ్య పోలికనే అనవసరమని చెప్పాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు ముందు క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్సే జట్టే పై చేయి సాధిస్తుందని చెప్పాడు. రాజస్థాన్‌లో ట్రెంట్ బౌల్ట్ మినహా మరో బలమైన పేసర్ లేడన్నాడు.

'కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో అతను సత్తా చాటాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు అతని స్ట్రైక్‌రేట్ లేకపోయినా.. అతను ఫామ్‌లోకి రావడం శుభసూచకం. ట్రెంట్ బౌల్ట్ మినహా రాజస్థాన్‌లో మరో మేటి పేసర్ లేడు. కానీ ఆ జట్టులో డేంజరస్ స్పిన్నర్లు ఉన్నారు. అయితే రాహుల్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం వారు కూడా ఏం చేయలేరు.

 Virender Sehwag

టీమిండియాలో చోటు గురించి మాట్లాడితే సంజూ శాంసన్ కంటే రాహుల్ ఎంతో నమయని చెబుతా. అతను టెస్ట్ మ్యాచ్‌లతో పాటు వివిధ దేశాల్లో శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో ఓపెనర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా సత్తా చాటాడు. టీ20ల్లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. లక్నోసూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 38 పరుగులే చేసింది. రాజస్థాన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓ మెయిడిన్ ఓవర్‌తో కట్టడి చేయడంతో లక్నో బ్యాటర్లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు.

టాస్ సందర్భంగా మాట్లాడిన రాహుల్ బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని తెలిపాడు. జైపూర్‌లో తమ జట్టుకు ఇదే తొలి మ్యాచ్ అని చెప్పిన రాహుల్.. శుభారంభం అందుకోవడం చాలా ముఖ్యమన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే మైదాన పరిస్థితులతో సంబంధం లేకుండా మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని చెప్పాడు.

తమ జట్టు ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతుందని, బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాలకు స్పష్టత ఉందన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటుతు విజయాలందుకున్నామని చెప్పిన రాహుల్.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. దాంతో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఈ ఈ క్రమంలోనే క్వింటన్ డికాక్‌ను జట్టులోకి తీసుకోలేదని, అతను మరికొన్ని మ్యాచ్‌లు వేచి చూడక తప్పదన్నాడు. అయితే క్వింటన్ డికాక్‌తో ఓపెనింగ్ చేయడాన్ని మాత్రం తాను ఆస్వాదిస్తానని చెప్పాడు.

Story first published: Wednesday, April 19, 2023, 20:17 [IST]
Other articles published on Apr 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+