Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్.. ఆటగాళ్ల మధ్య బండ బూతులు: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా? అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లోనే యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చే ఈ పోరుకు తెరలేవనుంది. ఆసియాకప్ 2023లో భాగంగా దాయాదీ దేశాలు సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఈ ఆసియా టోర్నీ ప్రారంభం కానుంది.

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా చివరిసారి తలపడ్డ భారత్, పాకిస్థాన్ జట్లు.. ఇన్నాళ్లకు మళ్లీ పోటీపడనున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే ఆ బజ్ మొదలైంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రోజుకో ప్రొమోతో అభిమానులను ఉత్తేజపరుస్తోంది.

Virender Sehwag says India-Pakistan sledging different level, We Cannot Share It On TV’

తాజాగా భారత్-పాక్ సమరాన్ని ఉద్దేశించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను అభిమానులతో పంచుకుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ హద్దులు ధాటుతోందని, ఆ మాటలను టీవీల్లో చెప్పలేమని సెహ్వాగ్ తెలిపాడు. 'భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌ను ఇరు దేశాల మధ్య యుద్దంలానే భావిస్తారు.

ప్రతీ ఒక్కరు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా పోరుకు మించి భారత్-పాకిస్థాన్ సమరం ఉంటుంది. ఇరు దేశాల వాడుక భాష హిందీ కావడంతో స్లెడ్జింగ్ హద్దులు ధాటుతోంది. ఆ మాటలను మనం టీవీల్లో చెప్పలేం. 'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

తాను ఆడే రోజుల్లో 2003-04 పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓ మ్యాచ్ సందర్భంగా అక్తర్‌తో జరిగిన మాటల యుద్దాన్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. హుక్ షాట్ ఆడాలని అక్తర్ పదే పదే తనను రెచ్చగొట్టాడని, అతని మాటలతో విసిగిపోయిన తాను నాన్ స్ట్రైకర్‌లో ఉన్న సచిన్‌ను చూపిస్తూ.. 'అక్కడ నీ అయ్య ఉన్నాడు.. ఆయనకు బౌన్సర్లు వేసి హుక్ షాట్ ఆడమను'అని బదులిచ్చానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌తో 9 టెస్ట్‌లు, 31 వన్డేలు, 2 టీ20లు ఆడిన సెహ్వాగ్.. 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలతో పాటు 8 అర్థ శతకాలు, ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

సెహ్వాగ్ దూకుడైన బ్యాటింగ్‌తో అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ నిద్రలేని రాత్రులు గడిపాడు. సెహ్వాగ్ తమ సింహా స్వప్నమని, అతన్ని ఔట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని ప్రెస్‌మీట్‌లో ప్రకటించాడు.

Story first published: Wednesday, August 16, 2023, 18:42 [IST]
Other articles published on Aug 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+