రిషభ్ పంత్ సింగిల్ తీసాడు కానీ నేనైతే సిక్స్ కొట్టేవాడిని: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లోపడ్డ భారత జట్టును రిషభ్ పంత్.. హార్దిక్ పాండ్యా(55 బంతుల్లో 10 ఫోర్లతో 71)తో కలిసి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు.

వరుసగా 5 బౌండరీలు..
ముఖ్యంగా డేవిడ్ విల్లే వేసిన 42వ ఓవర్‌లో పంత్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. వరుసగా 5 బౌండరీలు బాది విల్లేకు చుక్కలు చూపించాడు.
అయితే ఈ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన పంత్.. 43వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాది టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే పంత్ చివరి బంతికి బౌండరీ కొట్టాల్సిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాను పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా సిక్స్ బాదేవాడినని తెలిపాడు.

నేనైతే సిక్స్ కొట్టేవాడిని..
ఈ మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. రిషభ్ పంత్ అద్భుతం చేశాడని కొనియాడాడు.'ఒకవేళ 42వ ఓవర్ చివరి బంతికి పంత్ గనుక ఫోర్ కొట్టి ఉంటే మ్యాచ్ అపుడే ముగిసేది. అదనంగా పరుగు తీయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అయితే, పంత్.. ఆ బంతిని ఫోర్ కాదు.. ఏకంగా సిక్స్‌గా మలచాల్సింది. ఒకవేళ నేనే గనుక రిషభ్ పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఫోర్ లేదంటే సిక్సర్ బాదేవాడిని. వన్డే క్రికెట్‌లో రిషభ్ పంత్ నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.' సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

పంత్ సూపర్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), జేసన్ రాయ్ (31 బంతుల్లో 7 ఫోర్లతో 41) రాణించారు. హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా రాణించారు. పంత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'... హార్దిక్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.

పంత్ అరుదైన రికార్డు
ఇక తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా వెలుపల సెంచరీ సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అంతకుమందు రాహుల్ ద్రవిడ్ (145), కేఎల్ రాహుల్(112) ఈ అరుదైన రికార్డు సాధించారు. అదే విధంగా వన్డేల్లో సెంచరీ సాధించిన నాలుగో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన భారత వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications