Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీవీలో సచిన్‌ను చూసి ఆ కళాత్మక షాట్లు నేర్చుకున్నా: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag says I learnt the straight drive by watching Sachin Tendulkar on television

న్యూఢిల్లీ: టీవీలో క్రికెట్ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ ఆటను చూసి కళాత్మక స్ట్రైట్​ డ్రైవ్​తో పాటు బ్యాక్​ఫుట్​ షాట్లు నేర్చుకున్నానని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఓ మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఫుట్‌వర్క్ మెరుగుపరుచుకోవడానికి మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు.

'1992 ప్రపంచకప్​తో నేను టీవీలో క్రికెట్ చూడటం ప్రారంభించాను. అప్పుడే సచిన్​ ఆడుతున్న స్ట్రైట్​ డ్రైవ్​ను నేర్చుకున్నా. ఈ రోజుల్లో యువ ఆటగాళ్లకు చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల క్రికెట్​ షాట్లను తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సౌకర్యాలు మా రోజుల్లో ఉంటే నేను త్వరగానే భారత జట్టుకు ఎంపికయ్యేవాడిని."అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఇక తన కెరీర్‌లో చాలా మంది ఫుట్‌వర్క్ మెరుగుపరుచుకోవాలని సలహా ఇచ్చేవారని, కానీ ఎలా అనేది చెప్పేవారు కాదన్నాడు. 'నా కెరీర్​ ప్రారంభంలో చాలా మంది ఫుట్​వర్క్​ను మెరుగుపరుచుకోవాలనేవారు. కానీ, ఎలా అనేది మాత్రం చెప్పేవారు కాదు. మన్సూర్​ అలీ ఖాన్​ పటౌడీ, సునీల్ గవాస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్​.. ఈ విషయంలో నాకు సహాయం చేశారు" అని సెహ్వాగ్​ పేర్కొన్నాడు.

భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన సెహ్వాగ్.. భారత్ తరఫున 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. తన కెరీర్‌లో మొత్తం రెండు ట్రిపుల్ సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు బాదాడు. బంతిని బాదడమే లక్ష్యంగా ఆడే సెహ్వాగ్ ఆట అంటే అభిమానులు తెగ ఇష్టపడుతారు. అప్పర్ కట్ తన ట్రేడ్ మార్క్ షాట్. బౌన్సర్‌ను ఫ్లిక్ చేస్తూ కళాత్మకంగా బౌండరీ రాబట్టేవాడు. సిక్స్‌తో సెంచరీ చేయగల గట్స్ కూడా వీరూ సొంతం.

Story first published: Wednesday, June 9, 2021, 17:07 [IST]
Other articles published on Jun 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+