
కోహ్లీ గురించి అడిగితే..
బెస్టాఫ్ త్రీ ఫార్మాట్‌లో జరిగిన ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అనంతరం సెహ్వాగ్ మరో ఏడేనిమిదేళ్లపాటు భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. అయితే విరాట్ కోహ్లీ వైఫల్యాన్ని ఉద్దేశించి అతనికి రెస్ట్ అవసరమా? అని ప్రశ్నించగా.. తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి వెల్లడించాడు. '2008లో మేం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాను. ఈ ప్రశ్న తరహాలోనే నాకు రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన తట్టింది.

వన్డేలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా..
టెస్ట్‌ల్లో 150 పరుగులతో ఘనంగా రీఎంట్రీ ఇచ్చినా.. వన్డే క్రికెట్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యా. ధోనీ నన్ను జట్టు నుంచి తప్పించాడు. దాంతో వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నా. కేవలం టెస్ట్‌ల్లో కొనసాగాలనుకున్నా. సచిన్ టెండూల్కర్ నన్ను అడ్డుకున్నాడు. ఇది నీ కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్. ఈ సిరీస్ తర్వాత కొద్దిరోజులు వేచి చూడు. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకో అని చెప్పాడు. సచిన్ సూచనలతో నేను నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.

సవాళ్లను స్వీకరించేవాడు.
ఆటగాళ్లు రెండు రకాలుంటారు. కఠిన సవాళ్లను కొందరు నవ్వుతూ స్వీకరిస్తూ బ్యాట్‌తో బదులిస్తారు. విరాట్ ఆ జాబితాకు చెందినవాడే. విమర్శలను ఓపికగా విని తనదైన బ్యాటింగ్‌తో వారికి సమాధానమిస్తాడు. మరో రకం ఆటగాళ్లు ఎవరినీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతారు. నేను అలాంటి వాడినే. ఎవరిని పట్టించుకోకుండా పరుగులు చేయడంపైనే ఫోకస్ చేసేవాడిని'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
