Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంపైర్ ముందు పాంటింగ్‌‌ను బకరా చేసా.. ఫన్నీ స్టోరీ పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాను ఆడే రోజుల్లో మైదానంలో ఎంత సరదాగా ఉండేవాడినో వెల్లడించాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనకు అంపైర్లతో మాట్లాడే అలవాటు ఉండేదని చెప్పుకొచ్చాడు. తరుచూ అంపైర్లను మాట్లాడిస్తుండేవాడినని గుర్తు చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అంపైర్ ముందు బకరా చేశానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సరదా ఘటనకు సంబంధించిన వివరాలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మోహాలీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని సెహ్వాగ్ తెలిపాడు.

Virender Sehwag

'మ్యాచ్ జరుగుతున్నప్పుడు నాకు అంపైర్లతో మాట్లాడే అలవాటు ఉండేది. భారత్‌లో నేను సూపర్ స్టార్ ప్లేయర్‌ను.. మీకేమైనా కావాంటే చెప్పండి.. చేసి పెడుతాను అని ఆఫర్ ఇచ్చేవాడిని. కొందరు అంపైర్లు నా మాటలను లైట్ తీసుకునేవారు. మరికొందరు మాత్రం ఫలానా రెస్టారెంట్‌లో డిన్నర్ చేయాలనుందని అడిగే వారు.

నేను వెంటనే ఆ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి డిన్నర్ ఏర్పాట్లు చేయాలని డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పేవాడిని. ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో నేను 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నా. అసద్ రౌఫ్ అంపైర్‌గా ఉన్నాడు. బౌలర్ వేసిన బంతిని నేను కట్ షాట్ ఆడాను. ఆ శబ్దం మా డ్రెస్సింగ్ రూమ్ వరకు వినిపించింది.

ఎందుకంటే మొహాలీలో టెస్ట్ మ్యాచ్‌ చూసేందుకు జనాలు పెద్దగా వచ్చేవారు కాదు. దాంతో నేను ఆడిన కట్ షాట్ గట్టిగా వినబడింది. కానీ అంపైర్ నాటౌటిచ్చాడు. రికీ పాంటింగ్ నా దగ్గరకు వచ్చి బ్యాట్ తగిలిందా? అని అడిగాడు. నేను తగిలిందని చెప్పాను. బ్యాట్ తగిలితే ఎందుకు క్రీజును వీడలేదని అడిగాడు.

దానికి నువ్వు ఎప్పుడైనా ఇలా వెళ్లవా? నన్ను ఎందుకు అడుగుతున్నావ్? వెళ్లి అంపైర్‌ను అడుగని చెప్పా. రికీ పాంటింగ్ వెంటనే అంపైర్ దగ్గరికి వెళ్లి సెహ్వాగ్.. బ్యాట్ తగిలిందని చెప్పాడు. మీరేమో నాటౌట్ ఇచ్చారని ప్రశ్నించాడు. దాంతో అంపైర్ అసద్ రౌఫ్, రికీ పాంటింగ్‌ను నా దగ్గరకు తీసుకు వచ్చాడు. బ్యాట్ తగిలిందా? అని అడిగాడు.

నేను వెంటనే లేదన్నాను. పాంటింగ్‌తో అలా చెప్పలేదు. అతను అబద్దం ఆడుతున్నాడని బదులిచ్చాను. నా సమాధానంతో బిత్తరపోయిన రికీ పాంటింగ్ తలపట్టుకున్నాడు. నేను మాత్రం నవ్వుకున్నాను'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

అయితే అంపైర్ హరీస్ రౌఫ్‌కు బ్రాండెడ్ గ్లాసెస్, టీషర్ట్ అన్న చాలా పిచ్చి ఉండేదని సెహ్వాగ్ తెలిపాడు. 'హరీస్ రౌఫ్‌కు బ్రాండెడ్ వస్తువులు ధరించడం ఓ సోకు. ఆ సమయంలో నేను అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. అతనికి అడిడాస్ షూస్‌తో పాటు టీషర్ట్స్, సన్‌గ్లాసెస్ బహుమతిగా అందించాను. అవి ఇస్తూనే సరదాగా.. నేను ఔటైనప్పుడు ఫింగర్ ఎత్తకని చెప్పాను. అతను నేను చెప్పినట్లు మొహాలీ టెస్ట్‌లో చేశాడు.'అని సెహ్వాగ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 1, 2023, 20:38 [IST]
Other articles published on Aug 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+