IPL 2021 టైటిల్ ఏ జట్టు గెలిచినా సరే.. ముంబై ఇండియన్స్ మాత్రం గెలవద్దు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్ సినారియో మారుతుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఈ మూడు జట్లే టాప్-3లో ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. నాలుగో స్థానం కోసం మిగతా జట్లు పోటీపడుతున్నాయి. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ రేసులో ఉన్నాయి. అయితే ఈ సారి తనకు నయా చాంపియన్‌ను చూడాలని ఉందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కూడా చేరవద్దని కోరుకున్నాడు.

ముంబై గెలవద్దు..
క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. సెహ్వాగ్ ఐపీఎల్ టైటిల్ విన్నర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ముంబై ఇండియన్స్ టాప్-4లో కూడా నిలవద్దు. ఇప్పటి వరకు టైటిల్ గెలవని టీమ్ ప్లే ఆఫ్స్ చేరి టైటిల్ కొట్టాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లలో ఏది గెలిచినా పర్వాలేదు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలవాలని, అది అంత సులువు కాదన్నాడు. కాకపోతే ముంబై ఇండియన్స్ చరిత్ర చూస్తే వారికి ఇది సులువేననే అభిప్రాయం కలుగుతుందన్నాడు.

ముంబై హిస్టరీనే ఇది..
'ఒకవేళ ముంబై ఇండియన్స్ మిగిలిన మ్యాచ్‌లన్నిటినీ గెలిస్తే ఆ జట్టు సులువుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఎందుకంటే ఆ జట్టుకు 16 పాయింట్లు లభిస్తాయి. కాకపోతే అది చెప్పినంత సులువుకాదు. కొనిసార్లు గెలవాలని ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు తెలియకుండా తప్పిదాలు జరుగుతాయి. చివరకు ఆ తప్పిదాలే ఓటమిని శాసిస్తాయి. కాకపోతే ముంబై చరిత్ర చూస్తే మాత్రం ఆ జట్టు ఈ తరహా పరిస్థితుల్లో నుంచే విజయాలు సాధించి టైటిల్ సాధించింది. ఈ సీజన్‌లో కూడా ప్రతీ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ చేరితే ఫైనల్ కూడా వెళ్తుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ చరిత్రను రిపీట్ చేస్తుంది. కాకపోతే నేను ఈ చరిత్రలను పెద్దగా నమ్మను'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

టాప్‌లో చెన్నై..
ప్రస్తుతం 9 విజయాలు 18 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకుంది. ఇక ఆర్‌సీబీ 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఐదేసి విజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. నాలుగేసి విజయాలతో పంజాబ్, రాజస్థాన్ 6, 7 స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 విజయాలతో టేబుల్ అట్టడుగున నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications